IPO: 29 నుంచి స్వ‌స్తిక్ పైప్స్ ఐపీఓ

ఈ ఇష్యూ ద్వారా స్వ‌స్తిక్ పైప్ రూ. 62.52 కోట్ల‌ను స‌మీక‌రించ‌నుంది.

Updated : 27 Sep 2022 15:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వ‌స్తిక్ పైప్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ సెప్టెంబ‌రు 29న మొదలు కానుంది. అక్టోబ‌రు 3 వరకు సబ్‌స్క్రిప్షన్‌ కొనసాగుతుంది. ఒక్కో షేర్‌ ధ‌ర‌ను రూ. 97-100గా నిర్ణ‌యించారు. ఈ ఇష్యూ ద్వారా స్వ‌స్తిక్ పైప్స్ రూ. 62.52 కోట్ల‌ను స‌మీక‌రించ‌నుంది. ఈ నిధుల‌ను మూల‌ధ‌న పెట్టుబ‌డుల‌కు, ప‌రిపాల‌న వ్య‌యాల‌ కోసం, ఇష్యూ ఖ‌ర్చుల కోసం వినియోగించాల‌నే యోచ‌న‌లో ఉంది. 62.52 ల‌క్ష‌ల షేర్ల ఇష్యూలో 3,14,400 షేర్ల‌ను సెబీ న‌మోదిత స‌భ్యుల‌కు రిజ‌ర్వ్ చేసింది.

సందీప్ బ‌న్సల్‌, అనుప‌మ బ‌న్సల్‌, శాశ్వ‌త్‌ బ‌న్సల్‌, గీతాదేవి అగ‌ర్వాల్ స్వ‌స్తిక్ పైప్స్ ప్ర‌మోట‌ర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ 1973 నుంచి మైల్డ్ స్టీల్‌, కార్బ‌న్ స్టీల్‌, ఎల‌క్ట్రిక్ రెసిస్టెన్స్‌-వెల్డెడ్ బ్లాక్‌, గాల్వ‌నైజ్డ్ పైపులు, ట్యూబ్‌ల‌ను త‌యారుచేసి ఎగుమ‌తి చేస్తోంది. స్వ‌స్తిక్ పైప్స్.. హ‌రియాణా, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ల‌లో 2 కర్మాగారాలు కలిగి ఉంది. కంపెనీ ఈ మార్చితో ముగిసిన సంవ‌త్స‌రానికి రూ. 608.7 కోట్ల ఆదాయంపై (ప‌న్ను అనంత‌రం) రూ. 20.41 కోట్ల నిక‌ర లాభాన్ని న‌మోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని