Swiggy IPO: ఐపీఓకి స్విగ్గీ సన్నాహాలు? ఎప్పుడు రావొచ్చంటే?

సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు ఉన్న ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 800 మిలియన్ డాలర్లు (రూ.5.98 వేల కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది....

Published : 22 Feb 2022 20:39 IST

బెంగళూరు: సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు ఉన్న ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. 800 మిలియన్ డాలర్లు (రూ.5.98 వేల కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు రాయిటార్స్‌ పేర్కొంది.

ఐపీఓకి వీలుగా ఇప్పటికే స్విగ్గీ కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. బోర్డులో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లను నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేవలం ఓ ఫుడ్‌ డెలివరీ సంస్థగానే కాకుండా లాజిస్టిక్స్‌ కంపెనీగా మదుపర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల సమకూరిన పెట్టుబడులతో కంపెనీ విలువ రెండింతలై 10.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఫుడ్‌ డెలివరీ రంగంలో స్విగ్గీకి గట్టి పోటీనిస్తున్న జొమాటో గత ఏడాది ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే. మదుపర్లకు లిస్టింగ్‌లో మంచి లాభాలిచ్చిన ఈ సంస్థ తాజా మార్కెట్‌ కరెక్షన్‌లో భారీ దిద్దుబాటుకు గురైంది. భారత్‌లో ఆహారం, నిత్యావసర సరకుల పంపిణీ సంస్థలకు ఆదరణ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా ఆంక్షల సమయంలో వీటికి డిమాండ్‌ బాగా పెరిగింది. పైగా ఇటీవల క్విక్‌-కామర్స్‌కు సైతం బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇన్‌స్టామార్ట్‌ పేరుతో ఈ రంగంలోకీ ప్రవేశించిన స్విగ్గీ.. బ్లింకిట్‌, జిప్టో వంటి వాటితో పది నిమిషాల్లోనే సరకులు అందజేస్తామంటూ పోటీ పడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని