Swiggy: స్విగ్గీలో ఉద్యోగాల కోత.. 8-10 శాతం మందికి ఉద్వాసన పలికే యోచన!
ఉద్యోగాల కోతకు స్విగ్గీ సిద్ధమవుతోంది. ఐపీఓకు ముందే కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. దాదాపు 8-10 శాతం ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) ఉద్యోగాల తొలగించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం 6 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 8-10 శాతం మందిని తొలగించాలనుకుంటోందని (Layoffs) తెలిసింది. ప్రొడక్ట్, ఇంజినీరింగ్, ఆపరేషన్ డిపార్ట్మెంట్స్లో ఈ ఉద్యోగాల కోత ఉండే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపినట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పత్రిక తన కథనంలో తెలిపింది. ఐపీఓకు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంలో భాగంగా కంపెనీ ఈ చర్యలు చేపట్టనుందని తెలిసింది.
ఉద్యోగాల తొలగింపులో భాగంగా గతేడాది అక్టోబర్లో ఉద్యోగుల పనితీరుపై స్విగ్గీ సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు రేటింగ్ ఇచ్చి.. తమ పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం కల్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు కొన్ని నెలలుగా ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి ఉందని పేర్కొన్నాయి. ఐపీఓకు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ఉద్యోగులకు లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న నేపథ్యంలో దేశీయ స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందకు స్విగ్గీ ఆలోచన చేస్తోంది. టెక్ స్టాక్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఐపీఓను విషయంలోనూ వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. మరోవైపు స్విగ్గీ నష్టాలు సైతం రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2021లో రూ.1,617 కోట్లుగా ఉన్న నష్టాలు.. 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.3,628.90 కోట్లకు చేరాయి. అంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. స్విగ్గీ తన మార్కెట్ వాటాను సైతం జొమాటోకు కోల్పోతోందని బ్రోకరేజీ సంస్థ జఫ్రీచ్ గతంలో తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు