Electric Vehicles: స్విట్జర్లాండ్‌లో ఈవీలపై నిషేధం..! ఎందుకంటే?
ఎలక్ట్రిక్ వాహనాలపై స్విట్జర్లాండ్ నిషేధం విధించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈవీల వినియోగాన్ని నిషేధిస్తూ ముసాయిదాను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణహితం కోసం ప్రపంచదేశాలు కర్బనఉద్గారాలను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలు రాబోయే పదేళ్లలో పూర్తిగా ఈవీల తయారీపై దృష్టి సారించాలని వాహనతయారీ సంస్థలు ఆదేశించాయి. కానీ, స్విట్జర్లాండ్ మాత్రం వాటిపై నిషేధం విధించాలని భావిస్తోందని ది టెలిగ్రాఫ్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ మేరకు ముసాయిదాను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో తలెత్తున్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తోందట.
స్విట్జర్లాండ్ విద్యుత్ అవసరాల కోసం ఎక్కువగా హైడ్రోపవర్పై ఆధారపడుతుంది. దేశంలో వినియోగించే 60 శాతం విద్యుత్ హైడ్రోపవర్ నుంచే ఉత్పత్తి అవుతోంది. చలికాలంలో మాత్రం విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఆ సమయంలో ఫ్రాన్స్, జర్మనీ దేశాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలతోపాటు యూరప్‌లోని పలు దేశాలు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు అణురియాక్టర్ల అంతరాయం కారణంగా గత 30 ఏళ్ల కనిష్ఠానికి ఫ్రాన్స్ విద్యుత్పత్తి పడిపోవడంతో ఇతర దేశాలకు సరఫరాను నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా సంగీత, సినిమా ప్రదర్శనలు, ఆటల నిర్వహణ నిలిపివేయడంతోపాటు వ్యాపార సముదాయాలను రోజూ రెండు గంటలపాటు మూసివేయాలని ఆదేశించనుందట. అత్యవరమైతే తప్ప ఎలక్ట్రిక్ వాహనాలను సైతం వినియోగించవద్దని కోరనుందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రమైతే ఈవీల వినియోగంపై పూర్తిగా నిషేధం విధించాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇది అమలైతే ఈవీలపై నిషేధం విధించిన తొలిదేశం స్విట్జర్లాండ్ అవుతుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డు.. సంతోషంలో దర్శకధీరుడు
-
Movies News
Paruchuri Gopala Krishna: ‘ధమాకా’.. ఆ సీన్ చీటింగ్ షార్ట్లా అనిపించింది..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Arshdeep Singh: అర్ష్‌దీప్ ఎనర్జీ అంతా అక్కడే వృథా అవుతోంది: భారత మాజీలు
-
Politics News
Viveka murder Case: సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
-
India News
IAF: వాయుసేనకు భారీ నష్టం.. ఒకేసారి కూలిన మిరాజ్, సుఖోయ్ యుద్ధ విమానాలు