IHCL: ‘తాజ్‌’.. ప్రపంచంలో బలమైన హోటల్‌ బ్రాండ్‌

ప్రపంచంలోనే అత్యంత బలమైన హోటల్‌ బ్రాండ్‌ హోదాను టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌  (ఐహెచ్‌సీఎల్‌)లోని ‘తాజ్‌’ తిరిగి దక్కించుకుంది.

Updated : 13 Jun 2024 07:29 IST

దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత బలమైన హోటల్‌ బ్రాండ్‌ హోదాను టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌  (ఐహెచ్‌సీఎల్‌)లోని ‘తాజ్‌’ తిరిగి దక్కించుకుంది. బ్రాండ్‌ ఫైనాన్స్‌ రూపొందించిన ‘హోటల్స్‌ 50- 2024’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. తాజ్‌ బ్రాండ్‌ విలువ 45% పెరిగి 545 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,500 కోట్ల)కు చేరింది. బ్రాండ్‌ స్ట్రెంత్‌ సూచీ (బీఎస్‌ఐ)లో 100 పాయింట్లకు గాను 92.9 పాయింట్ల స్కోరును తాజ్‌ సాధించింది. తద్వారా ఏఏఏ ప్లస్‌ రేటింగ్‌తో ప్రపంచంలో బలమైన బ్రాండ్‌గా అవతరించింది. ప్రపంచంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న రెండో బ్రాండుగా కూడా తాజ్‌ నిలిచింది. ‘తాజ్‌ తన 120వ వసంతంలో.. మరోమారు ప్రపంచంలో అత్యంత బలమైన హోటల్‌ బ్రాండుగా నిలిచినందుకు సంతోషంగా ఉంది. నాలుగేళ్లకు గాను లభించే ఈ గుర్తింపును, మూడు సార్లు దక్కించుకోవడం 100 సంవత్సరాల చరిత్ర గల బ్రాండ్‌ ఘనతకు నిదర్శనం’ అని ఐహెచ్‌సీల్‌ ఎండీ, సీఈఓ పునీత్‌ చాట్వాల్‌ తెలిపారు. మా అతిథులు తాజ్‌ బ్రాండుపై కనబర్చిన విశ్వాసం, ఆప్యాయతను ఇది అద్దం పడుతోందని, సేవలు అందించడంలో మా సహోద్యోగులు ప్రదర్శించిన నిబద్దతను ఇది తెలియజేస్తోందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు