Tata fruit Juices: మార్కెట్‌లోకి టాటా పండ్ల రసాలు.. ఫ్రుస్కీ బ్రాండ్‌తో

టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ తాజాగా ఆల్కహాల్‌ రహిత బెవరేజెస్‌ రంగంలోకి ప్రవేశించింది. టాటా ఫ్రుస్కీ బ్రాండ్‌ పేరుతో పళ్ల రసాలను విడుదల చేసింది. 

Published : 04 Nov 2022 17:38 IST

దిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ (TCPL) ఫ్రూట్‌ జ్యూస్‌ రంగంలోకి ప్రవేశించింది. అనుబంధ సంస్థ నరిష్‌కో ద్వారా ‘ఫ్రుస్కీ జ్యూస్‌ ఎన్‌ జెల్లీ’ పేరిట పలు ఉత్పత్తులను విడుదల చేసింది. నరిష్‌కో పోర్ట్‌ఫోలియో విస్తరించాలనే లక్ష్యంతోనే తాజాగా ఆల్కహాల్‌ రహిత పానీయాల విభాగంలోకి ప్రవేశించినట్లు సంస్థ ఎండీ విక్రమ్‌ గ్రోవర్‌ తెలిపారు.

భారత ఫ్రూట్‌ జ్యూస్‌ మార్కెట్‌లో ఇప్పటికీ సంప్రదాయ పండ్ల రసాలు, అన్‌బ్రాండెడ్‌ జ్యూస్‌లదే ఆధిపత్యం కొనసాగుతోందని గ్రోవర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో టాటా ఫ్రుస్కీ బ్రాండ్‌తో విస్తరించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. కాలా ఖట్టా, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ చాట్‌, లెమన్‌ పుదీనా అనే మూడు ఫ్లేవర్లలో జ్యూస్‌లను విడుదల చేసినట్లు తెలిపారు. తొలుత కోల్‌కతా, ముంబయి, గోవా మార్కెట్లలో వీటిని విక్రయించనున్నారు. 200 ఎంఎల్‌ ప్యాక్‌ ధర రూ.20.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని