Apple stores: 100 యాపిల్‌ స్టోర్లు తెరవనున్న టాటా గ్రూప్‌?

Apple stores: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యాపిల్‌ స్టోర్ల (Apple stores)ను తెరవాలని టాటా గ్రూప్‌ (Tata Group) యోచిస్తోందని సమాచారం. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Published : 12 Dec 2022 15:20 IST

దిల్లీ: టాటా గ్రూప్‌ (Tata Group) దేశవ్యాప్తంగా ప్రత్యేక యాపిల్‌ స్టోర్ల (Apple stores)ను తెరిచే యోచనలో ఉన్నట్లు సమాచారం. వీటిలో కేవలం యాపిల్‌ ఉత్పత్తుల్ని మాత్రమే విక్రయిస్తారట. కొనుగోలు సముదాయాలు సహా రద్దీ ఉండే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టాటా సంస్థ(Tata Group)కు చెందిన ఇన్ఫినిటీ రిటైల్‌తో యాపిల్‌ ఒప్పందం కుదుర్చుకుంటోందని ‘ఎకానమిక్‌ టైమ్స్‌’ కథనం పేర్కొంది. ఇన్ఫినిటీ ఇప్పటికే క్రోమా పేరిట స్టోర్లను నిర్వహిస్తోంది.

ఈ ఒప్పందం ఖరారైతే ఇన్ఫినిటీ రిటైల్‌.. యాపిల్‌ ఫ్రాంచైజీ భాగస్వామిగా మారుతుంది. దేశవ్యాప్తంగా దాదాపు 100 స్టోర్లను తెరవొచ్చని సమాచారం. ఇవి యాపిల్‌ అధికారిక ‘రీసెల్లర్ కేంద్రాలు’గానూ పనిచేస్తాయని తెలుస్తోంది. యాపిల్‌ ఇప్పటికే ప్రీమియం రీసెల్లర్‌ కేంద్రాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టాటా తెరవనున్న స్టోర్లలో ప్రధానంగా ఐప్యాడ్‌లు, ఐఫోన్‌లు, యాపిల్‌ వాచ్‌లు విక్రయిస్తారని తెలుస్తోంది. దీనిపై యాపిల్‌గానీ, టాటా గ్రూప్‌గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని