Tata Motors EV: టాటా నుంచి మరో విద్యుత్‌ కారు.. త్వరలో టియాగో ఈవీ

విద్యుత్‌ వాహనాల విషయంలో టాటా మోటార్స్‌ (Tata Motors) దూకుడు పెంచింది. ఇప్పటికే నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ పేరిట వ్యక్తిగత వాహనాలను లాంచ్‌ చేసిన ఆ కంపెనీ.. త్వరలో మరో విద్యుత్‌ కారును తీసుకొస్తోంది.

Published : 09 Sep 2022 15:02 IST

ముంబయి: విద్యుత్‌ వాహనాల విషయంలో టాటా మోటార్స్‌ (Tata Motors) దూకుడు పెంచింది. ఇప్పటికే నెక్సాన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ పేరిట వ్యక్తిగత వాహనాలను లాంచ్‌ చేసిన ఆ కంపెనీ.. త్వరలో మరో విద్యుత్‌ కారును తీసుకొస్తోంది. తన ఎంట్రీ లెవెల్‌ మోడల్‌ టియాగో విద్యుత్‌ వాహనాన్ని (Tiago EV) ఈ నెల తర్వాత తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఈవీ దినోత్సవం సందర్భంగా టాటా మోటార్స్‌ ఈ ప్రకటన చేసింది. పర్యావరణ హితమైన వాహనాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా దీన్ని తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. త్వరలో టియాగోకు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్‌ వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.

రాబోయే ఐదేళ్లలో 10 ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకొస్తామని ఇప్పటికే టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ టియాగో ఈవీని తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ ప్యాసింజర్‌ వెహికల్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర ప్రకటించారు. భారత్‌ను ప్రపంచ ఈవీ హబ్‌గా మార్చాలన్న విజన్‌కు టాటా మోటార్స్‌ కట్టుబడి ఉందని చెప్పారు. 2030 నాటికి 30 శాతం వాహనాలు ఎలక్ట్రికల్‌వే ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం 40 వేల టాటా ఈవీలు రోడ్లపై పరుగులు పెడుతున్నాయని కంపెనీ పేర్కొంది.


Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని