Tata Motors: కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ కార్ల ధరలు పెంచింది. నవంబర్‌ 7 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

Published : 05 Nov 2022 13:11 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ (Tata motors) కార్ల ధరలు పెంచింది. నవంబర్‌ 7 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. సగటున 0.9 శాతం మేర ధర పెంచుతున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. పెరిగిన ధరల కారణంగా ఇప్పటికే కొంత భారాన్ని భరిస్తున్నామని, ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో పరిమిత స్థాయిలో పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టాటా మోటార్స్‌ పేర్కొంది.

జులైలో సైతం టాటా మోటార్స్‌ కార్ల ధరలను 0.55 శాతం మేర పెంచింది. ప్రస్తుతం టియాగో, పంచ్‌, నెక్సాన్‌, హ్యారియర్‌, సఫారీ పేరిట టాటా మోటార్స్‌ వివిధ కార్లను దేశంలో విక్రయిస్తోంది. 7వ తేదీ నుంచి వీటి ధరలు పెరగనున్నాయి. కాగా, అక్టోబర్‌ నెలలో మొత్తం 78,335 వాహనాలను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే 15.49 శాతం అధికంగా విక్రయాలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని