Tata Motors: పెరిగిన టాటా మోటార్స్‌ కార్ల ధరలు

ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన ధరలను పెంచింది....

Published : 23 Apr 2022 14:24 IST

ముంబయి: ప్రముఖ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన ధరలను పెంచింది. మోడల్‌, వేరియంట్‌ను బట్టి పెంపు గరిష్ఠంగా 1.1 శాతం వరకు ఉన్నట్లు వెల్లడించింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. నిర్వహణ వ్యయాలు, ముడిపదార్థాల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేయక తప్పడం లేదని పేర్కొంది. ఇటీవల మారుతీ సుజుకీ, బీఎండబ్ల్యూ సహా పలు వాహన సంస్థలు ధరలు పెంచిన విషయం తెలిసిందే. సెమీకండక్టర్ల కొరతతో పాటు పలు కీలక లోహాలు అందుబాటులో లేకపోవడం వాహన పరిశ్రమకు గతకొన్ని రోజులుగా సవాల్‌ విసురుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు