Tata motors: సీఎన్‌జీ వెర్షన్‌లో టాటా కొత్త ఆల్ట్రోజ్
Tata Altroz CNG: సీఎన్‌జీ వేరియంట్‌లో టాటా మోటార్స్ కొత్త ఆల్ట్రోజ్‌ను తీసుకొచ్చింది. ఆరు వేరియంట్లలో ఈ వస్తున్న ఈ వెహికల్ ధర రూ.7.55 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata motors) తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ (Altroz) సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.7.55 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) పేర్కొంది. ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ పేరుతో రిలీజ్ చేసిన ఈ కారు.. మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. హై ఎండ్ వేరియంట్ ధర రూ.10.55 లక్షలుగా టాటా మోటార్స్ పేర్కొంది.
ట్విన్ సిలిండర్ సీఎన్‌జీ టెక్నాలజీతో వస్తున్న కొత్త ఆల్ట్రోజ్‌లో అత్యాధునిక ఫీచర్లు అందిస్తున్నారు. వాయిస్ అసిస్టెంట్‌తో ఓపెన్ అయ్యే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇందులోని ట్విన్ సీఎన్‌జీ సిలిండర్లు లగేజీకి ఏరియాకు దిగువన అందిస్తున్నారు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 8 స్పీకర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
వినియోగదారులు ప్రత్యామ్నాయ ఇంధనంవైపు చూస్తున్నారని, ముఖ్యంగా ఆర్థికంగా, పర్యావరణ హితంగా ఉండే వాహనాలను కోరుకుంటున్నారని టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. అందుకే విస్తృతంగా లభించే, ఆమోదయోగ్యమైన సీఎన్‌జీ వేరియంట్ ఆల్ట్రోజ్‌ను తీసుకొచ్చినట్లు శైలేష్ తెలిపారు. సీఎన్‌జీ వాహనాన్ని ఎంపిక చేసుకున్నంత మాత్రన కొన్ని ఫీచర్లు, బూట్ స్పేస్ విషయంలో రాజీపడాల్సి అవసరం లేదని, గతేడాది జనవరిలోనే ఐసీఎన్‌జీ టెక్నాలజీ ద్వారా ఆ అనుమానాలను నివృత్తి చేశామని తెలిపారు. తమ ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లు వ్యక్తిగత వినియోగదారులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/09/2023)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్