Tata motors: టాటా కార్ల ధరలూ పెరగనున్నాయ్‌!

Tata motors price hike: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ (Tata motors)  వచ్చే నెల నుంచి వాహన ధరలు పెంచేందుకు (price hike) రంగం సిద్ధం చేసుకుంటోంది.

Updated : 06 Dec 2022 00:05 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ (Tata motors) తన పాసింజర్‌ వాహన ధరలను (price hike) పెంచనుంది. జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. ముడిసరకు ధరలు అధికంగా ఉండడం, కొత్త ఉద్గార ప్రమాణాలు అనుసరించాల్సి ఉండడం వంటివి ఇందుకు కారణాలుగా పేర్కొంది. ఈ మేరకు పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో టాటా మోటార్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (పాసింజర్‌, ఈవీ) శైలేష్‌ చంద్ర పెంపు నిర్ణయం గురించి వెల్లడించారు.

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అన్ని వాహన కంపెనీలూ కేంద్రం నిర్దేశించిన కొత్త ఉద్గార ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. దీనికి తోడు ముడిసరకు ధరలు అధికంగా ఉండడం, బ్యాటరీల ధరలూ పెరగడం వల్ల వాహన ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడిందని శైలేశ్‌ చంద్ర తెలిపారు. జనవరి నుంచి పెంపు ఉంటుందని తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని ఇది వరకే మారుతీ సుజుకీ ప్రకటించింది. టాటా సైతం ఆ జాబితాలో చేరింది. పంచ్‌, నెక్సాన్‌, హ్యారియర్‌, సఫారీ పేరిట ప్రయాణికుల వాహనాలను, టియాగో ఈవీ, నెక్సాన్‌ ఈవీ పేరిట విద్యుత్‌ వాహనాలను టాటా మోటార్స్‌ విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని