Tata Motors Q2 Results: టాటా మోటార్స్‌ నష్టం ₹898 కోట్లు

టాటా మోటార్స్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.898 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

Published : 09 Nov 2022 18:35 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.898 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,416 కోట్లతో పోలిస్తే నికర నష్టం భారీగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇక కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ.62,246 కోట్ల నుంచి రూ.80,650 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

ఇక స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ రూ.293 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం నికర నష్టం రూ.659 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ నికర ఆదాయం సైతం రూ.11,197 కోట్ల నుంచి రూ.15,142 కోట్లకు పెరిగింది. బుధవారం కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.44 శాతం క్షీణించి రూ.433 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని