Tata motors: టాటా వాణిజ్య వాహన ధరలూ ప్రియం

Tata Motors price hike: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తన కమర్షియల్‌ వాహన ధరలనూ పెంచనుంది. జనవరి నుంచి అన్ని మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

Published : 13 Dec 2022 16:47 IST

దిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ (Tata Motors) తన వాణిజ్య వాహన ధరలనూ (Price hike) పెంచనుంది. జనవరి నుంచి అన్ని మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని టాటా మోటార్స్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. మోడల్‌ను బట్టి పెంపు వర్తిస్తుందని తెలిపింది.

పెరిగిన ధరలను కంపెనీ భరిస్తూ వచ్చిందని, ఉత్పత్తి వ్యయం మరింత పెరగడంతో ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. కమర్షియల్‌ వాహన విభాగంలో టాటా మోటార్స్‌ అగ్రగామిగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కంపెనీ ప్రయాణికుల వాహన ధరలను జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 2023 నుంచి కఠిన ఉద్గార నిబంధనలు, ఉత్పత్తి వ్యయం ఇందుకు కారణంగా చూపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని