2025 నాటికి 10 కొత్త విద్యుత్‌ వాహనాలు

దేశీయంగా 2025 నాటికి 10 కొత్త బ్యాటరీ విద్యుత్‌ వాహనాలను (బీవీఈలు) తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వాటాదార్లకు వెల్లడించారు. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్‌ అందించే ప్రపంచ అగ్రగామి.....

Published : 29 Jun 2021 12:31 IST

టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌

దిల్లీ: దేశీయంగా 2025 నాటికి 10 కొత్త బ్యాటరీ విద్యుత్‌ వాహనాలను (బీవీఈలు) తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ వాటాదార్లకు వెల్లడించారు. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్‌ అందించే ప్రపంచ అగ్రగామి సంస్థల్లో టాటా మోటార్స్‌ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సెల్, బ్యాటరీ తయారీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు.దేశ వ్యాప్తంగా ఛార్జింగ్‌ స్టేషన్ల వంటి మౌలిక వసతుల్ని పెంచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తామ’ని చంద్రశేఖరన్‌ తెలిపారు. నెక్సాన్‌ ఈవీలను గత ఏడాది విడుదల చేయగా, ఇప్పటివరకు 4,000 వాహనాలను విక్రయించింది.2020-21 లో కంపెనీ అత్యధిక వార్షిక విక్రయాలు నమోదు చేసింది. దీంతో మార్కెట్‌ వాటాను 8.2 శాతానికి పెంచుకోగలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు