Tata Play Binge: రూ.199కే డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5 సహా 18 ఓటీటీలు!
Tata Play Binge: టాటా ప్లే బింజ్ మొబైల్ ప్రో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.199కి అందుబాటులో ఉంది. ఒకేసారి 18 ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరవై ఐదుకి పైగా ఓటీటీల్లోని కంటెంట్‌ను ‘టాటా ప్లే బింజ్’ (Tata Play Binge) ఒకే యాప్, వెబ్‌సైట్ కిందకు తీసుకొచ్చింది. సులభంగా చెప్పాలంటే ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో అనేక ఓటీటీ (OTT Services)ల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టాటా ప్లే డీటీహెచ్ కస్టమర్లకు కూడా బింజ్ అందుబాటులో ఉంటుంది.
నెట్‌ఫ్లిక్స్ (Netflix), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar), జీ5 (Zee5), సోనీలివ్ (Sony Liv), ఈరోస్ నౌ, హంగామా ప్లే సహా మొత్తం 25కి పైగా ఓటీటీలు టాటా ప్లే బింజ్‌లో అందుబాటులో ఉంటాయి. టాటా ప్లే బింజ్ మొబైల్ ప్రో సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఒకేసారి 18 ఓటీటీల్లోని కంటెంట్‌ను వీక్షించొచ్చు. అదీ మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లోనూ అందుబాటులో ఉంటాయి. కావాలంటే ఒకేసారి రెండింట్లోనూ చూడొచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్ సహా ఈరోస్‌నౌ, హంగామా, ఎపికాన్, హోయ్‌చొయ్.. ఇలా మొత్తం 18 ఓటీటీల్లోని కంటెంట్‌కు మొబైల్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌లో యాక్సెస్ ఉంటుంది.
నెల, మూడు నెలలు, ఏడాది.. మొత్తం మూడు సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లు ఉన్నాయి. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.199కి అందుబాటులో ఉంది. మూడు నెలల ప్లాన్‌కు రూ.569, ఏడాది ప్లాన్‌కు రూ.2,189 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ను కేవలం మొబైల్‌లో మాత్రమే వీక్షించడానికి అనుమతి ఉంటుంది. అలాగే సన్‌నెక్ట్స్‌ను.. ఎఫ్‌టీవీ, బింజ్+లో మాత్రమే వీక్షించొచ్చు. దీంతో పాటు పాటు సూపర్, మెగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను కూడా టాటా ప్లే బింజ్ అందిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే