Tata Play Binge: 17 ఓటీటీలకు ఒకటే సబ్‌స్క్రిప్షన్‌.. టాటా ప్లే బింజ్‌ ప్లాన్ల వివరాలివే..!

Tata Play Binge plans in telugu: ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో ప్రముఖ ఓటీటీలనూ వీక్షించే సదుపాయం కల్పిస్తోంది టాటా ప్లే బింగే. MX player చేరికతో ఓటీటీల సంఖ్య 17కు చేరింది.

Published : 24 Sep 2022 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీలు వచ్చాక అరచేతిలోనే కొత్త సినిమాలు దర్శనమిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే సినిమా హాళ్ల నుంచి నేరుగా మన మొబైళ్లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఒక్కో సినిమా ఒక్కో ఓటీటీలో వస్తుండడం, వాటికి వేర్వేరుగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవడం భారంగా మారింది. దీంతో ఓటీటీలన్నింటినీ ఒక వేదికపైకి తెస్తోంది ప్రముఖ డీటీహెచ్‌ కంపెనీ టాటా ప్లే. టాటా ప్లే బింజ్‌ పేరిట ఈ సేవలను అందిస్తోంది. ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో ప్రముఖ ఓటీటీలనూ వీక్షించే సదుపాయం కల్పిస్తోంది. తాజాగా టాటా ప్లే బింజ్‌లో ఎంఎక్స్‌ ప్లేయర్‌ (MX player) కూడా వచ్చి చేరింది. దీంతో టాటా బింజ్‌లో ఓటీటీల సంఖ్య 17కు చేరింది.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ.. ఇలా అన్ని భాషాలకు చెందిన సినిమాలు, సీరియళ్లు, వెబ్‌ సిరీస్‌లు అందించే ఓటీటీ వేదికలూ టాటా ప్లే బింజ్‌లో అందుబాటులో ఉన్నాయి. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్‌, వూట్‌ సెలెక్ట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, సన్‌ నెక్ట్స్‌, హంగామా ప్లే, ఎరోస్‌ నౌ వంటి పాపులర్‌ ఓటీటీలతో పాటు ఇతర ఓటీటీలు ఇందులో ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు రూ.59 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఓటీటీల సంఖ్యను బట్టి సబ్‌స్క్రిప్షన్‌ ధరలో మార్పు ఉంటుంది. అన్నీ ఓటీటీలూ కావాలంటే నెలకు రూ.299 చొప్పున చెల్లించాలని టాటా ప్లే బింజ్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. టాటా ప్లే బింజ్‌+, అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌ ద్వారా టీవీల్లోనూ ఈ ఓటీటీలను వీక్షించొచ్చని చెబుతోంది. 

రూ.59 ధరలో మొత్తం మూడు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. జీ5 ప్లాన్‌ కావాలంటే కనీసం నెలకు రూ.99 ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. హాట్‌స్టార్‌ ఓటీటీతో కూడిన ప్లాన్‌ కావాలంటే రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. హాట్‌స్టార్‌, జీ5, సోనీలివ్‌ వంటి అన్ని ప్రముఖ ఓటీటీలూ కావాలంటే రూ.299 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్‌ సబ్‌స్క్రిప్షన్‌ సింగిల్‌ లాగిన్‌కు అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. మరిన్ని వివరాలకూ టాటా ప్లే బింజ్‌ వెబ్‌సైట్‌ను చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని