పంచ్‌ ఈవీకి బీఎన్‌క్యాప్‌లో 5 స్టార్‌ రేటింగ్‌

భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ రేటింగ్‌లో టాటా మెటార్స్‌కు చెందిన మరో ఎస్‌యూవీ వచ్చి చేరింది. దీనిపై కేంద్ర మంత్రి హర్షం వ్యక్తంచేశారు.

Published : 13 Jun 2024 18:48 IST

దిల్లీ: భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (భారత్‌-ఎన్‌క్యాప్‌) రేటింగ్‌లో టాటా మోటార్స్ పంచ్‌ ఈవీ 5 స్టార్‌ రేటింగ్‌ దక్కించుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన కార్లలో టాటా సఫారీ, టాటా హారియర్‌, టాటా పంచ్‌ ఈవీ తర్వాత ఎన్‌క్యాప్‌లో చోటు దక్కించుకున్న నాలుగో వాహనం ఇదే. ఎన్‌క్యాప్‌ ప్రోగ్రామ్‌ కింద పెద్దవాళ్లు, పిల్లల భద్రతకు సంబంధించి 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన వాహనాల్లో మరో ఎస్‌యూవీ చేరడంపై కంపెనీ సంతోషం వ్యక్తంచేసింది.

టాటా నెక్సాన్‌ ఈవీ పెద్దవాళ్ల భద్రతకు సంబంధించిన అంశాల్లో 32కి 29.86 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 44.54 పాయింట్లు సాధించింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. నెక్సాన్‌ ఈవీ ధర రూ.14.49- రూ.19.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 

వర్చువల్‌ క్రెడిట్ కార్డ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

భారత్‌లో తయారయ్యే వాటితోపాటు, విదేశాల్లో తయారై, భారత మార్కెట్లో విడుదలయ్యే కార్లను క్రాష్‌ టెస్ట్‌ చేసి, వాటి సేఫ్టీ ఫీచర్ల ఆధారంగా స్టార్‌ రేటింగ్‌ ఇచ్చేందుకు భారత్‌ ఎన్‌క్యాప్‌ను కేంద్రం తీసుకొచ్చింది. తప్పనిసరి నియంత్రణ నిబంధనలతో పాటు అధునాతన రహదారి భద్రత, వాహన భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఇది నడుచుకుంటుంది. భారత్‌ ఎన్‌క్యాప్‌ రేటింగ్‌లో టాటా మోటార్స్‌ మరో వాహనం వచ్చి చేరడంపై రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తంచేశారు. ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో.. సురక్షితమైన వాహనాల్ని ఎంచుకొనేందుకు భారత్‌- ఎన్‌క్యాప్‌ రేటింగ్‌ సాయపడుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని