Tata: ఐపీఎల్‌లో ‘టాటా పంచ్‌ కజిరంగా ఎడిషన్‌ ’ వేలం..!

ఐపీఎల్‌-2022 వేలంలో టాటా మోటార్స్ సరికొత్త ‘పంచ్‌ కజిరంగా ఎడిషన్‌’ కారును వేలం వేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది.

Updated : 13 Feb 2022 12:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌-2022 వేలంలో టాటా మోటార్స్ సరికొత్త ‘పంచ్‌ కజిరంగా ఎడిషన్‌’ కారును వేలం వేయనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్‌కు టాటా సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో  పంచ్‌ ప్రత్యేక ఎడిషన్‌ను వేలం వేయాలని నిర్ణయించింది. ఈ వేలం ద్వారా సమకూరిన ఆదాయాన్ని కజిరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పనులకు వెచ్చించనున్నారు. ఈ కారు ప్రత్యేకతలను టాటా మోటార్స్‌ ఇంకా బహిర్గతం చేయలేదు.

‘‘ఈ ప్రత్యేకమైన కారు కేవలం ఫ్యాన్స్‌ కోసం మాత్రమే వేలం వేస్తున్నాం. ఈ మొత్తాన్ని కజిరంగా పార్క్‌లో పర్యావరణ అవసరాల కోసం వెచ్చిస్తాం. బిడ్డింగులో విజయం సాధించిన వారు ఈ స్పెషల్‌ ఎడిషన్‌ ఎస్‌యూవీని సొంతం చేసుకొంటారు’’ అని టాటా మోటార్స్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

టాటా సంస్థ విక్రయిస్తున్న మైక్రో ఎస్‌యూవీ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఇటీవల టాటా మోటార్స్‌ చరిత్రలోనే తొలిసారి నెలవారీ విక్రయాలు 40వేలను దాటడంలో ఈ ఎస్‌యూవీ పాత్ర చాలా ఉంది. ఈ కారు చిన్న సైజులో ఉన్నా.. ఆకర్షణీయమైన ఫీచర్లను వినియోగదారులకు అందిస్తోంది. ఆటోమేటిక్‌ హెడ్‌లైట్స్‌, ఏడు అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, క్లైమెట్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, ఏబీఎస్‌, ఈబీడీ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు దిల్లీలో ఎక్స్‌షోరూమ్‌ ప్రారంభ ధర రూ.5.65 లక్షల నుంచి అత్యధికంగా రూ.9.29 లక్షల వరకు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని