Tata Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లపై లుక్కేయండి..

Tata Tiago EV details in telugu: భారత మార్కెట్లో టియాగో ఈవీ పేరిట టాటా మోటార్స్‌ మరో విద్యుత్‌ కారును లాంచ్‌ చేసింది.

Updated : 28 Sep 2022 16:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విద్యుత్‌ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్‌ (Tata motors).. భారత మార్కెట్లో మరో విద్యుత్‌ కారును లాంచ్‌ చేసింది. టియాగో ఈవీని (Tata Tiago EV) రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.  24 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.9.09 లక్షలు నుంచి మొదలవుతుంది. అయితే, తొలి 10 వేలమంది కస్టమర్లకే ఈ ధర అని పేర్కొంది. ఆ తర్వాత ధర ఎంత ఉంటుందనేది కంపెనీ  వెల్లడించలేదు. అక్టోబర్‌ 10 నుంచి వీటి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది.

ఇక కారు స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. 19.2kWh ఆప్షన్‌తో వస్తున్న వేరియంట్‌ 3.3 kW AC ఛార్జర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. సింగిల్‌ ఛార్జ్‌తో ఈ కారు 250 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. 24 kWh బ్యాటరీ వేరియంట్‌ కారు 7.2 kW ఏసీ ఛార్జర్‌తో వస్తోంది. ఇది బ్యాటరీని 3.36 గంటల్లోనే ఫుల్‌ ఛార్జ్‌ చేస్తుందని తెలిపింది. డీసీ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం ఛార్జ్‌ అవ్వడానికి 57 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఫుల్‌ ఛార్జ్‌తో ఈ కారు ద్వారా 315 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఇది కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.

టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఎలక్ట్రిక్‌ ORVMs, క్రూజ్‌ కంట్రోల్‌, స్టార్ట్‌/స్టాప్‌ పుష్‌ బటన్‌, లెదర్‌ సీట్స్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సిటీ, స్పోర్ట్‌ డ్రైవింగ్‌ మోడ్స్‌ ఇస్తున్నారు. రిమోట్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ కంట్రోల్‌, రిమోట్‌ జియో ఫెన్సింగ్‌, వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి మొత్తం 45 కనెక్ట్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ విద్యుత్‌ కార్లలో వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1100 ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల (ఏది ముందైతే) వారెంటీ ఇస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని