ITR: ఫ్లాట్ నిర్మాణంలో ఉంటే.. గృహ రుణ చెల్లింపులపై పన్ను క్లెయిం చేసుకోవచ్చా?
గృహ రుణ అసలు చెల్లింపులపై సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షలు, వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24 బి కింద రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
ప్రస్తుతం చాలా మంది నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నిర్మాణం పూర్తవక ముందే కొనుగోలు చేస్తే.. కాస్త తక్కువ ధరకు ఇల్లు అందుబాటులో ఉండడంతో పాటు, తమ అభిరుచికి తగినట్లుగా డిజైన్ చేయించుకోవచ్చనే ఉద్దేశంతో కొనుగోలు చేస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు.. గృహ రుణం ద్వారా ఇల్లు కొనుగోలు చేసినప్పుడు కలిగే ఆదాయపు పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి.
సాధారణంగా.. గృహరుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేస్తే.. చెల్లింపులపై పన్ను ప్రయోజనాలు పొందొచ్చు. గృహ రుణ అసలు చెల్లింపులపై సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షలు, వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 24బి కింద రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు.
నిర్మాణంలో ఉన్న ఇంటిని కొంటే..
ఒకవేళ మీరు నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే..కొనుగోలు చేసిన వెంటనే ఈఎంఐ చెల్లింపులు ప్రారంభమైనప్పటికీ వడ్డీ మాత్రమే చెల్లిస్తారు, అది కూడా వెంటనే క్లెయిం చేసుకోలేరు. ఆస్తి నిర్మాణం పూర్తయి..ఇంటిని స్వాధీనం చేసుకున్నట్లు ‘పొజెషన్ సర్టిఫికేట్’ పొందిన తర్వాత మాత్రమే సెక్షన్ 24బి కింద వడ్డీని క్లెయిం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
నిర్మాణంలో ఉన్నప్పుడు చెల్లించిన వడ్డీ సంగతేంటి?
నిర్మాణంలో ఉన్నప్పుడు చెల్లించిన వడ్డీని కూడా క్లెయిం చేసుకునే అవకాశం ఉంది. అయితే, అది కూడా నిర్మాణం పూర్తైన తర్వాత మాత్రమే క్లెయిం చేసుకోవచ్చు. ఎలాగంటే, ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు చెల్లించిన వడ్డీని 5 సమ భాగాలుగా విభజించి, స్వాధీనం చేసుకున్న ఏడాది నుంచి 5 సంవత్సరాల పాటు(ఆయా సంవత్సరాలకు చెల్లించిన వడ్డీ) క్లెయిం చేసుకోవచ్చు. అయితే ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి వరకు మాత్రమే మినహాయింపునకు అనుమతిస్తారు.
ఉదాహరణకు, పన్ను చెల్లింపుదారుడు ఇల్లు స్వాధీనం చేసుకోకముందు రూ.5 లక్షల వరకు గృహ రుణ వడ్డీని చెల్లించాడనుకుందాం. ఇంటిని స్వాధీనం చేసుకున్న ఆర్థిక సంవత్సరంలో రూ.95 వేలు వడ్డీ చెల్లించాల్సి వస్తే..అతను ఆ సంవత్సరంలో రూ. 1.95 లక్షల(రూ.95 వేలు+రూ.1 లక్ష(రూ.5,00,000/5)) వరకు సెక్షన్ 24బి కింద క్లెయిం చేసుకోవచ్చు.
గమనిక: పన్ను చెల్లింపుదారులు రిటర్నుల ఫైలింగ్ కోసం పాత పద్ధతిని ఎంచుకున్నప్పుడు మాత్రమే మినహాయింపులు క్లెయిం చేసుకోవచ్చు.
ఏదైనా నష్టం ఉందా?
పైన చెప్పినట్లు గృహ రుణం అసలు చెల్లింపులపై సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అయితే సెక్షన్ 80సి కింద ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే పన్ను క్లెయిం చేసుకునే వీలుంది. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినప్పుడు బ్యాంకులు సాధారణంగా నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఈఎంఐలో వడ్డీ మాత్రమే వసూలు చేస్తాయి. అసలు చెల్లింపులు నిర్మాణం పూర్తయి ఫ్లాట్ స్వాధీనం చేసుకున్న తర్వాత మాత్రమే ప్రారంభమవుతాయి. కాబట్టి నిర్మాణం పూర్తయి అసలు చెల్లింపులు ప్రారంభమయ్యేంత వరకు సెక్షన్ 80సి కింద మినహాయింపు క్లెయిం చేసుకోలేరు. అదీగాక ఫ్లాట్ నిర్మాణం ఆలస్యమైతే..ఎన్ని సంవత్సరాలు ఆలస్యం అయితే అన్ని సంవత్సరాలు అసలు చెల్లింపులు ప్రారంభం కావు, కాబట్టి వడ్డీ చెల్లింపులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/03/2023)
-
Movies News
Brahmanandam: ఏ జీవిగా పుట్టించినా నవ్వించాలనే కోరుకుంటా: బ్రహ్మానందం
-
Movies News
Kangana Ranaut: ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి: కంగనా రనౌత్
-
Politics News
New Front: నవీన్ పట్నాయక్‌తో మమత భేటీ.. కూటమిపై చర్చించారా..?
-
Sports News
Wasim Jaffer: సూర్యకుమార్‌కు బదులు సంజూ శాంసన్‌ని తీసుకోండి: వసీం జాఫర్
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్