Surjit Bhalla: భారత్‌లో పన్నుల వసూళ్లు అత్యధికం.. ఆదాయపుపన్నును 40% నుంచి 25%కి తగ్గించాలి
భారత్ సంపన్న దేశం కానప్పటికీ పన్నుల వసూళ్లు ఇక్కడే అత్యధికమని ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా (Surjit Bhalla) పేర్కొన్నారు.
దిల్లీ: ప్రపంచంలో భారత్ సంపన్న దేశం కానప్పటికీ పన్నుల వసూళ్లు ఇక్కడే అత్యధికమని ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా (Surjit Bhalla) పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలు కలిపి దేశ జీడీపీలో 19శాతం ఉన్నాయన్నారు. ప్రస్తుతం గరిష్ఠంగా ఉన్న 40శాతం ఆదాయపు పన్ను రేటును 25శాతానికి తగ్గించాలని అన్నారు. పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన.. ఆర్థికవృద్ధి మరింత వేగం పుంజుకోవాలంటే పన్నులు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.
‘2శాతం పాయింట్లను తగ్గించే దిశగా ఆలోచించాలి. ప్రత్యక్ష పన్నుల విషయానికొస్తే.. అన్నిరకాల పన్నుల రేటు 25శాతానికి మించకూడదు. సర్వీస్‌ఛార్జీలతో కలిసి ప్రస్తుతం 40శాతానికి దగ్గరగా ఉన్నాయి. కార్పొరేట్ టాక్సు రేటు మాదిరిగానే ఆదాయపన్ను రేటు ఉండాలి’ అని సుర్జిత్ భల్లా పేర్కొన్నారు. సమాజంలో కేవలం కొన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూరే విధంగా కాకుండా.. అన్నివర్గాల వారికి ఈ పన్నుల తగ్గింపు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల్లో ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యమే అధికంగా ఉంటుందని.. పన్ను ఎగవేతను తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!
-
TS High Court: అక్టోబరులోగా సింగరేణి ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనంపై ఆంక్షలు.. ఆందోళనకు దిగిన మండపాల నిర్వాహకులు
-
Harish Rao: మంత్రి మండలి సిఫార్సులను తిరస్కరించడం దారుణం: హరీశ్‌రావు
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?