Q-A: 25 ఏళ్ళ క్రితం కొన్న ఇల్లు ఇప్పుడు అమ్మితే పన్ను కట్టాలా?

ఇంటి అమ్మకాల విషయంలో దీర్ఘకాల మూలధన లాభంపై సుమారుగా 20 శాతం వరకు పన్ను వర్తిస్తుంది.

Published : 23 Nov 2022 16:28 IST

సర్, నేను 25 ఏళ్ళ క్రితం రూ. 90 వేల మొత్తంతో ఇల్లు కొన్నాను. ఇటీవలే దీన్ని రూ.38 లక్షలకు అమ్మేసాను. ఎంత పన్ను వర్తిస్తుంది?

- బెల్వేంద్రన్

ఇంటి అమ్మకాల విషయంలో దీర్ఘకాల మూలధన లాభంపై సుమారుగా 20 శాతం వరకు పన్ను వర్తిస్తుంది. అయితే, ద్రవ్యోల్బణం ప్రకారం మీ కొనుగోలు ధర ఇప్పటి విలువలో సుమురగా రూ.3 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి, పన్ను పరంగా మీ లాభం సుమారుగా రూ.35 లక్షలు. దీనిపై 20 శాతం పన్ను, అంటే సుమారుగా  రూ.7 లక్షల వరకు పన్ను వర్తిస్తుంది. అయితే, ఇల్లు అమ్మిన తర్వాత పొందిన మొత్తాన్ని(అమ్మిన తేదీ నుంచి 2 ఏళ్లలోపు) మీరు మరో ఇంటి కొనుగోలు కోసం వాడినట్లైతే పన్ను మినహాయింపు పొందొచ్చు.


మా నాన్న గారి వయసు 75, ఆయనకి రూ. 40 వేలు పింఛను వస్తుంది. వారికి రూ. 1 కోటి లేదా రూ. 50 లక్షల బీమా హామీ తో టర్మ్ పాలసీ తీసుకోవచ్చా? అలాగే, రూ. 5-10 లక్షల ఆరోగ్య బీమా తీసుకోవచ్చా? మా అమ్మ గారు నాన్న గారి మీద ఆధారపడి ఉన్నారు.

- శ్రీకర్

సాధారణంగా, 70 ఏళ్ళ పై బడిన వారికి టర్మ్ ప్లాన్ దొరకడం కష్టతరం అవుతుంది. చాలా వరకు కంపెనీ లు 60 ఏళ్ళ లోపు వయసు ఉన్న వారికి మాత్రమే టర్మ్ ప్లాన్ అందిస్తుంటారు.  ప్రీమియం కూడా వయసుతో పెరుగుతూ వస్తుంది. మీరు మాక్స్ లైఫ్, ఐసీఐసీఐ లాంటి కంపెనీలను సంప్రదించవచ్చు. టర్మ్ ప్లాన్ బదులు ఏదైనా మిగులు ఉన్నట్లయితే రికరింగ్ డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లయితే ఫిక్సిడ్ డిపాజిట్ లేదా సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పధకంలో మదుపు చేయవచ్చు. డిపాజిట్‌దారుడి తదనంతరం నామినీకి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. 

ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం చాలా మంచిది. మీతో పాటు వారికోసం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే, దానికి అదనంగా సూపర్ టాప్ అప్ పాలసీని తీసుకోవడం ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు వీలుంటుంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్, స్టార్ హెల్త్ కంపెనీల పాలసీలు పరిశీలించండి. వయసు పరంగా ప్రీమియం కూడా కాస్త ఎక్కువగా ఉండవచ్చు. వారికోసం వ్యక్తిగత ప్లాన్లను కూడా పరిశీలించవచ్చు. ఫ్లోటర్, వ్యక్తిగత ప్లాన్లలో ఏది తక్కువ ప్రీమియం ఉంటే దాన్ని ఎంచుకోవచ్చు.


నా వయస్సు 38 ఏళ్ళు. నాకు ఏ విధమైన రుణాలు లేవు. నాకు నెలకు రూ. 60,000 జీతం వస్తుంది. ఏ బ్యాంకులో ఎంత గృహ రుణం వస్తుందో తెలుపగలరు.

- విజేత

మీకు ఇతర రుణాలు లేవు కాబట్టి సుమారుగా రూ.45-50 లక్షల వరకు గృహ రుణం పొందే అవకాశం ఉంది. బ్యాంకును బట్టి ఇది మారుతుంది. ఎస్బీఐలో వడ్డీ రేటు కాస్త తక్కువ. మిగతా బ్యాంకులను కూడా సంప్రదించడం మంచిది. మీ జీతంలో ఈఎంఐ 30 శాతానికి మించకుండా చూసుకోండి. ఇతర లక్ష్యాల కోసం కూడా కొంత మొత్తాన్ని పీపీఎఫ్, ఎన్పీఎస్ లేదా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయడం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని