
సీనియర్ సిటిజన్స్ కొరకు ట్యాక్స్ సేవర్ ఎఫ్డీలు
సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఇష్టపడేవి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లే. రిస్క్ లేకుండా ఉండటం, బ్యాంకులు ఇంటికి దగ్గరగా ఉండటం, బ్యాంకు కార్యకలాపాలలో అప్పటికే బాగా పరిచయం ఉండటం కలిసొచ్చే విషయాలు. పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇవి 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వస్తాయి. ఈ డిపాజిట్లకు 5.40% నుండి 7.25% వడ్డీని ఇచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయి. ఐటీ చట్టం సెక్షన్ 80సీ మీ పెట్టుబడులపై పన్ను మినహాయింపును అందిస్తుంది. పన్ను ఆదా చేసే ఎఫ్డీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, దేశంలోని కొన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తున్న ప్రస్తుత వడ్డీ రేట్లు ఈ కథనం లో ఉన్నాయి.
హామీ ఇచ్చే రాబడులను అందించేటప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు దేశంలో ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎఫ్డీలలో పెట్టుబడికి నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన వడ్డీ వస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు రిస్క్ తక్కువగా ఉన్న చోట, పెట్టుబడి పదవీకాలాన్ని ఎంచుకోవడానికి వెసులుబాటు ఉన్నటువంటి ఒక ఎంపిక. ఈ ఎఫ్డీలు సీనియర్ సిటిజన్లు రెగ్యులర్ ఆదాయాన్ని సంపాదించడంలో సహాయపడతాయి. ఇటీవల చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్ల ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచాయి.
పెట్టుబడిదారుడి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం ఎఫ్డీ రాబడికి పూర్తిగా పన్ను విధించబడుతుంది కాబట్టి, వాస్తవ రాబడి మరింత తగ్గుతుంది. 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో వచ్చే పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద మీ పెట్టుబడులపై పన్ను మినహాయింపును అందిస్తాయి. సీనియర్ సిటిజన్ ఇన్వెస్టర్లు సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిని పెట్టి మినహాయింపు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు ఇది అద్భుతమైన పెట్టుబడి ఎంపిక. ఎందుకంటే చాలా బ్యాంకులు వారికి అదనంగా 0.50% వడ్డీ రేటును అందిస్తాయి. అయితే లాక్-ఇన్ వ్యవధి కారణంగా అకాల ఉపసంహరణలు అనుమతించబడవు.
పన్ను ఆదా చేసే ఎఫ్డీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, దేశంలోని కొన్ని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అందిస్తున్న ప్రస్తుత వడ్డీ రేట్లు ఇక్కడ ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. బ్యాంకుకి బ్యాంకుకి మారతాయి.
సీనియర్ సిటిజన్లకు టాక్స్ సేవింగ్స్ డిపాజిట్లకు వచ్చే వడ్డీ వివరాలు ఈ క్రింది టేబుల్లో ఉన్నాయి.
ఈ డేటా 15 మార్చి 2022 నాటిది.
ఈ పట్టికలో సీనియర్ సిటిజన్లకు (సూపర్ సీనియర్ సిటిజన్లు మినహా) 5 సంవత్సరాల కాలపరిమితితో పన్ను ఆదా చేసే ఎఫ్డీలు మాత్రమే ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Vikram: విక్రమ్ వచ్చేస్తున్నాడు.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..!
-
Politics News
Andhra News: ఏపీ రాజకీయ చిత్రపటంపై వైకాపా ప్లీనరీ తనదైన ముద్ర వేస్తుంది: విజయసాయి
-
Business News
Prepaid Plan: ₹1000తో డైలీ 3జీబీ డేటా..180 రోజుల వ్యాలిడిటీ..దేంట్లో తెలుసా?
-
Sports News
Cricket Records : RRR.. సరసన చేరేదెవరు?
-
Politics News
Maharashtra: గవర్నర్.. రఫేల్ జెట్ కంటే వేగంగా ఉన్నారే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు మరోసారి సస్పెన్షన్