Tech Mahindra: టెక్‌ మహీంద్రా Q3 లాభాల్లో 5 శాతం క్షీణత

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా (Tech Mahindra) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (Q3 Results)ఫలితాలను సోమవారం ప్రకటించింది.

Published : 30 Jan 2023 23:46 IST

దిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్‌ మహీంద్రా (Tech Mahindra) త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2022)  డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (Q3 Results)లో నికర లాభం 5 శాతం క్షీణించింది. 2020-21లో ఇదే త్రైమాసికంలో  రూ.1,378.2 కోట్ల లాభం ఆర్జించగా.. గతేడాది రూ. 1,297 కోట్లు మాత్రమే లాభం వచ్చినట్లు కంపెనీ తెలిపింది. మొత్తం ఖర్చులు మాత్రం 25 శాతం పెరగాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 

కంపెనీ ఏకీకృత ఆదాయం 20 శాతం పెరిగింది. అక్టోబర్-డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.13,734.6 కోట్ల ఆదాయం రాగా.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో  ఇదే త్రైమాసికంలో రూ.11,451 కోట్లు ఆర్జించింది. ‘‘మా కస్టమర్ల డిమాండ్లు, వారి సాంకేతిక అవసరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. డిజిటల్‌ సేవల కోసం పనిచేస్తూనే ఉంటాం. కఠినమైన స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా లాభాల్లో మెరుగైన వృద్ధిని సాధించలేక పోయాం’’ అని టెక్‌ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, సీఎఫ్ఓ సీపీ గుర్నాని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని