Tecno Phantom V Foldable Phone: టెక్నో నుంచి ఫోల్డబుల్‌ ఫోన్ వస్తోంది

ఫోల్డబుల్‌ ఫోన్‌ను తీసుకురానునట్టు టెక్నో ప్రకటించింది. ఏప్రిల్‌ 12 నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Published : 01 Apr 2023 21:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మడతపెట్టే ఫోన్లకు మార్కెట్‌లో ఆదరణ పెరగుతోంది. ఇప్పటికే ఒప్పో, శాంసంగ్‌  ఈ మోడల్‌ ఫోన్లను మార్కెట్‌లో విడుదల చేశాయి. తాజాగా ఈ సెగ్మెంట్‌లో ఫోన్‌ను  తీసుకొచ్చేందుకు ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ టెక్నో సిద్ధమవుతోంది. టెక్నో ఫాంటమ్‌ వీ ఫోల్డ్‌ (Tecno Phantom V Fold) పేరుతో ఫోల్డబుల్ మొబైల్‌ని భారత్‌లో లాంచ్‌ చేయాలని నిర్ణయించింది. భారత్‌లోనూ ఈ ఫోన్ల తయారీని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ నాటికి మార్కెట్‌లో అందుబాటులో ఉండేదుకు టెక్నో సన్నాహాలు మొదలుపెట్టింది.

ఫీచర్లివే
మూడు పవర్‌పుల్‌ కెమెరాలతో ఈ పోర్టబుల్ ఫోన్ రానుంది. ప్రధాన కెమెరా  50 ఎంపీ, 13ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్‌ సెన్సార్‌, 50 ఎంపీ 2x పోర్టబుల్‌ లెన్స్‌ని అమర్చనున్నారు. ఎక్స్‌టర్నల్‌ స్కీన్‌లో సెల్ఫీకోసం 32 ఎంపీ కెమెరా, ఇన్నర్‌ డిప్ల్పేలో 16ఎంపీ కెమెరాను ఇస్తున్నారు. 12జీబీ +512జీబీ వేరియంట్‌తో ఈ ఫోన్ రానుంది. దీనికి 5,000mAh బ్యాటరీని 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయంతో ఇచ్చారు. 6.42 అంగుళాల FHD+ LTPO ఔటర్ అమోల్డ్‌ డ్యూయల్ డిస్‌ప్లేను ఇస్తున్నారు.  ఏరోస్పేస్‌-గ్రేడ్‌తో తయారు చేసిన ఒక ఫీచర్‌ను ఈ ఫోన్‌కు అందించనున్నారు. దీంతో మడత పెట్టే సమయంలో ఎటువంటి ఫోన్‌కు నష్టం కలగదు. 5G SA/NSA, డ్యుయల్‌ 4G VoLTE కి సపోర్ట్‌ చేస్తుంది. ప్రత్యేక ధర రూ.77,777తో ఏప్రిల్‌ 12 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉండనుందని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని