3+1 టెల్కోలకు మద్దతివ్వాలి

సునీల్‌ భారతీ మిత్తల్‌

దిల్లీ: దేశీయ టెలికాం రంగంలో 3 ప్రైవేటు కంపెనీలు, ఒక ప్రభుత్వ కంపెనీ నమూనాకు మద్దతు ఇవ్వాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుకుంటోందని భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ మిత్తల్‌ పేర్కొన్నారు. కంపెనీలు పెట్టిన పెట్టుబడులపై గౌరవప్రద ప్రతిఫలాలు అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘ఆర్థిక వ్యవస్థలో టెలికాం రంగ పాత్ర పెరుగుతోంది.. అలాగే సవాళ్లూ పెరుగుతున్నాయి. అనిశ్చిత ధరలు, తక్కువ ప్రతిఫలాలు, ఎక్కువ మూలధన వాతావరణం.. వీటికి తోడు చట్టబద్ధ వ్యవహారాలు టెల్కోలను ఇబ్బంది పెడుతున్నాయ’ని ఎయిర్‌టెల్‌ వార్షిక నివేదిక-2020-21లో ఆయన వివరించారు.

అంతర్జాతీయంగా ముందు నిలవాలంటే..

దీర్ఘకాల మదుపర్లకు ఒక ‘హామీనిచ్చే గమ్యస్థానం’గా భారత కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒక అంతర్జాతీయ దిగ్గజంగా మారడానికి మనకు అవకాశం ఉంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే పెట్టుబడులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమిచ్చేలా మన విధానాలు మారాల్సి ఉంది. ఎయిర్‌టెల్‌ తన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంద’ని సునీల్‌ మిత్తల్‌ వివరించారు. కరోనా సవాళ్లలోనూ టెలికాం రంగం కీలక పాత్ర పోషించి దేశంలోని వందల కోట్ల మందిని అనుసంధానం చేయగలిగిందని అన్నారు.

ఈ రంగాల్లో అవకాశాలు

‘భారత్‌ మరింత డిజిటలీకరణ దిశగా పయనిస్తున్న తరుణంలో డేటా కేంద్రాలు, సముద్రగర్భ కేబుళ్ల ఏర్పాటు, క్లౌడ్‌ సర్వీసులు, సైబర్‌ భద్రత వంటి రంగాల్లో భారీ అవకాశాలున్నాయి. రాబోయే ఏడాదిలో ఈ విభాగాల్లో మేం పెట్టుబడులను పెంచనున్న’ట్లు మిత్తల్‌ పేర్కొన్నారు.


పవర్‌గ్రిడ్‌ లాభం రూ.5,998 కోట్లు

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీజీసీఐఎల్‌) రూ.5,998.28 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.2,048.42 కోట్లతో పోలిస్తే ఇది మూడింతలు కావడం విశేషం. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.9,816.72 కోట్ల నుంచి రూ.10,391.61 కోట్లకు చేరింది.


Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని