Caller ID: ‘కాలర్‌ ఐడీ’పై ట్రయల్స్‌ మొదలు పెట్టిన టెలికాం కంపెనీలు

Caller ID : ఇన్‌కమింగ్‌ కాల్స్‌ వచ్చినప్పుడు అవతలి వ్యక్తుల పేర్లు డిస్‌ప్లే అయ్యే కాలర్‌ ఐడీ సేవలపై టెలికాం కంపెనీలు పరిమిత స్థాయిలో ప్రయోగాలను ప్రారంభించాయి.

Updated : 15 Jun 2024 14:59 IST

Caller ID | ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలర్‌ ఐడీకి (Caller ID) సంబంధించి ట్రయల్స్‌ను టెలికాం కంపెనీలు ప్రారంభించాయి. ఏదైనా నంబర్‌ నుంచి ఇన్‌కమింగ్‌ కాల్‌ వచ్చినప్పుడు ఆ వ్యక్తి పేరును చూపించడం దీని ఉద్దేశం. ఈ విషయంలో టెలికాం కంపెనీలు ఆది నుంచి సుముఖంగా లేనప్పటికీ.. ప్రభుత్వం, ట్రాయ్‌ ఒత్తిడితో పరిమిత స్థాయిలో ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. రానున్న కొన్ని వారాల్లో మరిన్ని నగరాల్లో ట్రయల్స్‌ నిర్వహించాలని భావిస్తున్నాయి.

ఫోన్లలో ట్రూకాలర్‌ తరహా ఫీచర్‌.. టెలికాం కంపెనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

ఇటీవల కాలంలో స్పామ్‌, మోసపూరిత కాల్స్‌ పెరిగిపోయిన నేపథ్యంలో కాలింగ్‌ నేమ్‌ ప్రజంటేషన్‌ తీసుకురావాలని ట్రాయ్‌ ప్రతిపాదించింది. దీన్ని తొలుత టెలికాం కంపెనీలు వ్యతిరేకించాయి. సాంకేతిక అంశాలను కారణంగా చూపాయి. ప్రభుత్వం, ట్రాయ్‌ ఒత్తిడి నేపథ్యంలో కాలర్‌ ఐడీ పనితీరుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. ప్రతిపాదిత సేవలు ఆచరణ సాధ్యమా లేదా అనేది నివేదికను టెలికాం విభాగానికి ఆయా సంస్థలు నివేదిక సమర్పించనున్నాయి. ప్రస్తుతానికి ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ సంస్థలు ఇదే తరహా సేవలు అందిస్తున్నప్పటికీ.. పూర్తి స్థాయిలో టెలికాం కంపెనీలే తమ మొబైల్‌ డేటాలోని నంబర్లను చూపించడం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం, ట్రాయ్‌ భావిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని