Ashwini Vaishnaw: టెలికాం శాఖలో 10 మంది సీనియర్‌ అధికారులపై అశ్వినీ వైష్ణవ్‌ వేటు

టెలికాం శాఖలో 10 మంది ఉన్నతోద్యోగులపై వేటు పడింది. పనితీరు సరిగా లేదన్న కారణంతో మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ వీరిని తొలగించారు.

Updated : 24 Dec 2022 17:47 IST

దిల్లీ: విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తూ పనితీరు సరిగా కనబరచని అధికారులపై టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) వేటు వేశారు. టెలికాం విభాగంలో (DoT officers) పనిచేస్తున్న 10 మంది సీనియర్‌ అధికారులను బలవంతపు రిటైర్మెంట్‌పై పంపించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో జాయింట్‌ సెక్రటరీ స్థాయి ఉద్యోగి కూడా ఉన్నారని పేర్కొన్నాయి. మిగిలిన తొమ్మిది మంది డైరెక్టర్‌ స్థాయి అధికారులు అని తెలిసింది. విధుల్లో అవినీతి, చిత్తశుద్ధిపై అనుమానంతో వీరిని విధుల నుంచి తప్పించేందుకు మంత్రి ఆమోదం తెలిపారని సమాచారం.

పెన్షన్‌ నిబంధనలను అనుసరించి టెలికాం విభాగంలో ఒక ఉద్యోగిని ఇలా బలవంతంగా పదవీ విరమణపై పంపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతకుముందు సెప్టెంబర్‌లో ఇలానే మంత్రి వైష్ణవ్‌ నిర్వహించిన సమావేశంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి నిద్రపోవడంతో ఆయన చేత స్వచ్ఛంద పదవీ విరమణ చేయించారు. వైష్ణవ్‌ నిర్వహిస్తున్న రైల్వే శాఖలో సైతం ఇప్పటికే 40 మంది ఉద్యోగుల్ని ఇలానే ఇంటికి పంపించారు. పనితీరు సరిగాలేని, చిత్తశుద్ధి కనబరచని ఉద్యోగుల చేత బలవంతపు రిటైర్మెంట్‌ చేయించారు. వీరిలో సెక్రటరీ స్థాయి అధికారితో పాటు ఇద్దరు స్పెషల్‌ సెక్రటరీ అధికారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని