- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
5G auction: చిన్న సర్కిల్ కోసం గట్టి పోటీ.. 4వ రోజూ కొనసాగుతున్న వేలం!
దిల్లీ: వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు కావాల్సిన 5జీ స్పెక్ట్రమ్ కోసం జరుగుతోన్న వేలం వరుసగా నాలుగోరోజైన శుక్రవారమూ ప్రారంభమైంది. ఓ సర్కిల్లోని నిర్దేశిత ప్రాంతంలో బ్యాండ్ కోసం గురువారం సంస్థలు పోటీపడ్డాయి. అది ఏ మెట్రోనగరాలో లేక కేటగిరీ-ఏ సర్కిలో అనుకుంటే పొరపాటే. ‘బీ’ కేటగిరీ సర్కిల్ జాబితాలో ఉన్న ‘ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు’ ప్రాంతంలో.. అదీ 4జీ స్పెక్ట్రమ్‌లోని 1,800 మెగా హెర్ట్జ్స్ బ్యాండ్ కోసం టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే సంస్థలు పోటాపోటీగా బిడ్లు దాఖలు చేయడంతో వేలం నాలుగో రోజుకు చేరింది.
బిడ్ల విలువపరంగా చూస్తే.. గత రెండు రోజుల్లో పెద్దగా పెరిగిందేమీ లేదు. వేలం ప్రారంభమైన మంగళవారం రూ.1.45 లక్షల కోట్ల బిడ్లు దాఖలు కాగా.. బుధవారానికి అది రూ.1,49,454 కోట్లకు పెరిగింది. గురువారం మరో రూ.169 కోట్ల బిడ్లు దాఖలు కావడంతో రూ.1,49,623 కోట్లకు చేరింది. ఇతర బ్యాండ్లకు పోటీ స్థిరంగా ఉండగా.. యూపీ ఉత్తర ప్రాంతంలో 1,800 మెగా హెర్ట్జ్స్ బ్యాండ్ కోసం దాఖలవుతున్న బిడ్ల విలువ మాత్రం పెరుగుతూ పోతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
ప్రత్యేకంగా యూపీ ఉత్తర ప్రాంతంలో బ్యాండ్ కోసం పోటీపడడానికి ఓ కారణం ఉంది. ఆ ప్రాంతంలో దాదాపు 14.5 కోట్ల జనాభా ఉంది. వీరిలో 9 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. అత్యధికంగా ఎయిర్‌టెల్‌కు 3.74 కోట్లు, రిలయన్స్ జియోకు 3.29 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 2.03 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. గురువారం అత్యధికంగా ఏడు రౌండ్ల వేలం జరిగింది. శుక్రవారం 17వ రౌండ్ నుంచి వేలం కొనసాగుతోంది. వేలం సుదీర్ఘంగా కొనసాగడం ఆరోగ్యకరమైన పోటీకి నిదర్శనమని కేంద్ర సమాచార, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bengal: చేపల వేటకు వెళ్లిన 18 మంది మత్స్యకారుల గల్లంతు
-
Sports News
AIFF: ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పదవి.. బరిలో దిగిన టీమ్ఇండియా ఫుట్‌బాల్ దిగ్గజం
-
General News
Telangana News: లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి
-
Movies News
Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
-
Sports News
Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్ కష్టమే: భారత మాజీ ఆటగాడు
-
India News
CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Nithyananda: నిత్యానందకు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- CBI Raids: కేజ్రీవాలే సీబీఐకి ఉప్పందించారేమో.. భాజపా సంచలన వ్యాఖ్యలు..!
- Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు
- ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
- printouts @ doorstep: ఫుడ్డే కాదు.. ప్రింట్స్ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు!
- Axar : జడేజాకు షాడో.. అప్పటివరకు జట్టులోకి అక్షర్ కష్టమే: భారత మాజీ ఆటగాడు