Indian Chief: మార్కెట్లోకి మూడు ‘ఇండియన్‌ చీఫ్‌’ మోటార్‌ సైకిళ్లు..!

భారత మార్కెట్‌లోకి ఇండియాన్‌ చీఫ్‌ మూడు రకాల మోటార్‌ సైకిళ్లను వాడుతోంది. డార్క్‌ హార్స్‌, బొబ్బార్‌ డార్క్‌ హార్స్‌, సూపర్‌ ఛీప్‌ లిమిటెడ్‌లను విడుదల చేసింది.

Updated : 27 Aug 2021 18:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మార్కెట్‌లోకి ఇండియన్‌ చీఫ్‌ కంపెనీ మూడు రకాల మోటార్‌ సైకిళ్లను తీసుకొచ్చింది. డార్క్‌ హార్స్‌, బొబ్బార్‌ డార్క్‌ హార్స్‌, సూపర్‌ చీఫ్‌ లిమిటెడ్‌లను విడుదల చేసింది. ఈ మోటార్‌ సైకిళ్ల ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.20.75 లక్షలుగా నిర్ణయించింది. అత్యధికంగా సూపర్‌ చీఫ్‌ లిమిటెడ్‌ ఏబీఎస్‌ మెరూన్‌ మెటాలిక్‌ బైక్‌ ధరను రూ.22,84,130గా పేర్కొంది. 

ఇప్పటికే ఈ బైక్‌ కొనుగోళ్లకు సంబంధించి ప్రీబుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. తొలుత రూ.3 లక్షలు చెల్లించి బైక్‌ను బుక్‌ చేసుకోవచ్చు. క్లాసిక్‌ అమెరికన్‌ వి ట్విన్‌ ప్లాట్‌ఫామ్‌పై వీటిని తయారు చేశారు. ఈ బైక్‌లో 116 వీ ట్విన్‌ 1,890 సీసీ ఇంజిన్‌ అమర్చారు. ఇది 162 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైకుకు అత్యధిక శక్తి అవసరం లేని సమయంలో ఇంజిన్‌ వెనుక సిలిండర్‌ను ఆఫ్‌ చేయొచ్చు. దీనికి 15 లీటర్ల ఇంధన ట్యాంక్‌ ఇచ్చారు. రెండు ఎగ్జాస్టులు, ఎల్‌ఈడీ లైటింగ్‌లు, కీ రహిత ఇగ్నిషియన్‌, పైరిల్లీ నైట్‌ డ్రాగన్‌ టైర్లు అమర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని