Maruti Suzuki: 1,80,000 కార్లను రీకాల్‌ చేసిన మారుతీ సుజుకీ

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 1,81,754 యూనిట్లును రీకాల్‌ చేసింది. వీటిల్లో సియాజ్‌,ఎర్టిగా,విటార్‌ బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎక్స్‌ఎల్‌6 కార్ల రీకాల్‌ చేసిన వాటిల్లో ఉన్నాయి.

Published : 03 Sep 2021 19:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 1,81,754 యూనిట్లను రీకాల్‌ చేసింది. వీటిల్లో సియాజ్‌, ఎర్టిగా, విటార్‌ బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎక్స్‌ఎల్‌ 6 కార్లు ఉన్నాయి. ‘‘2018 మే 4వ తేదీ నుంచి 2020 అక్టోబర్‌ 27వ తేదీ మధ్య తయారు చేసిన 1,81,754 కార్లను వెనక్కి రప్పిస్తున్నాం. ఈ  రీకాల్‌ ప్రపంచ వ్యాప్తంగా వర్తిస్తుంది. భద్రతా పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడకూడదని ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అని మారుతీ సుజుకీ ఒక ప్రకటనలో పేర్కొంది. వెనక్కి పిలిపించిన కార్లను తనిఖీ చేసి అవసరమైతే మోటార్‌ జనరేటర్లను మార్చనుంది.

వాహన యజమానులకు స్థానిక వర్క్‌షాప్‌ల నుంచి వ్యక్తిగతంగా సమాచారం అందుతుంది. నవంబర్‌ తొలివారం నుంచి లోపం ఉన్న భాగాన్ని మార్చే కార్యక్రమం మొదలవుతుంది. అప్పటి వరకు వినియోగదారులు కార్లను నీరు నిలిచిన ప్రదేశాల్లో నడపవద్దని మారుతీ కోరింది. దీంతోపాటు ఎలక్ట్రానిక్‌ భాగాలపై నీటిని పిచికారీ చేయవద్దని కూడా సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని