Bill Gates: ఆ షేర్లన్నీ ఇప్పటికీ బిల్‌గేట్స్‌ చేతిలో ఉండి ఉంటేనా.. 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ మళ్లీ తొలి స్థానానికి ఎగబాకింది. 2.53 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగిన ఈ సంస్థ.. ఇటీవలే యాపిల్‌(2.468 ట్రి.డా)ను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ షేరు ధర 336.99 డాలర్లుగా ఉంది.

అయితే, ఈ షేరు ధర చూసి మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ బహుశా పశ్చాత్తాపపడుతూ ఉండి ఉంటారు! ఆయనకేమోగానీ, మనకైతే నిజంగానే ఉసూరుమనిస్తుంది! ఎందుకంటే మైక్రోసాఫ్ట్‌ తొలిసారి 1998 సెప్టెంబరులో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించిన నాటికి ఆయనకు ఈ కంపెనీలో రెండు బిలియన్ల షేర్లు ఉండేవి. అంటే ఆయన సంపద ఇప్పటికి 690 బిలియన్‌ డాలర్లు దాటి ఉండేది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌ సంపద కలిపినా కూడా దీనికి సమానమయ్యేది కాదు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడైన ఎలాన్ మస్క్‌ సంపద ప్రస్తుతం 340.4 బిలియన్‌ డాలర్లు. అమెజాన్‌ సహవ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్ సంపద 200.3 బిలియన్‌ డాలర్లు.

2020లో మైక్రోసాఫ్ట్‌ బోర్డు నుంచి వైదొలిగిన సందర్భంగా బిల్‌గేట్స్‌ ఆయన ఖాతాలోని మెజారిటీ వాటాలను అమ్మేశారు. బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ తరఫున నిర్వహిస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకే వైదొలుగుతున్నానని ఆయన అప్పట్లో ప్రకటించారు. తర్వాత ఆయనపై చాలా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తన భార్య మిలిందా గేట్స్‌కు విడాకులు కూడా ఇచ్చారు.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌..?

ఇక మస్క్‌ విషయానికి వస్తే.. స్పేస్‌ఎక్స్‌, టెస్లాతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన సంపద సైతం అదే స్థాయిలో ఎగబాకుతూ పోతోంది.  ప్రస్తుతం అత్యంత ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న ఆయన.. ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా అవతరించే అవకాశం ఉందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. అయితే, టెస్లా కంటే కూడా అంతరిక్ష పరిశోధనలు, రోదసీ పర్యాటకంపై దృష్టి సారించిన స్పేస్‌ఎక్స్‌ ఆయనకు కాసులు కురిపించే అవకాశం ఉందని చెబుతున్నారు!

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని