
CREDAI: క్రెడాయ్ నూతన కార్యవర్గమిదే
హైదరాబాద్: క్రెడాయ్ హైదరాబాద్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. 2021-23 ఏడాదికి గానూ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు క్రెడాయ్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా పి.రామకృష్ణారావు తిరిగి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా జి.ఆనంద్‌రెడ్డి, కంచం రాజేశ్వర్, ఎన్.జయదీప్ రెడ్డి, బి. జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శిగా వి. రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా ఆదిత్య గౌరాను ఎన్నుకున్నారు.
సంయుక్త కార్యదర్శులుగా కె.రాంబాబు, శివాజీ ఠాకూర్.. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా బి.ప్రదీప్‌రెడ్డి, ఎం.సతీష్‌కుమార్, జి.నితీశ్‌రెడ్డి, సంజయ్‌కుమార్ బన్సల్, ఎ.శ్రీనివాస్, కె.క్రాంతికిరణ్ రెడ్డి, ఎన్.వంశీధర్‌రెడ్డి, శ్రీరామ్ ముసునూరులను ఎన్నుకున్నట్లు చెప్పారు. ఆగస్ట్ 13, 14, 15 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.