Gas cylinder Price: మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. నేటి నుంచే అమల్లోకి

గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. రాయితీ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.75 పెంచారు....

Published : 01 Sep 2021 11:43 IST

దిల్లీ: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మళ్లీ పెరిగాయి. రాయితీ వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.75 పెంచారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెరగడం గమనార్హం. తాజా పెరుగుదలతో దిల్లీలో రాయితీ వంటగ్యాస్‌ ధర రూ.884.50కి, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ ధర ₹ 1,693కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని