Petrol Diesel Prices: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు

ముడి చముర ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా

Updated : 16 Oct 2021 08:56 IST

ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్‌ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్‌ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా శనివారం లీటర్‌ పెట్రోల్ 36 పైసలు‌, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా ఏపీలోని అనంతపురంలో పెట్రోల్‌ లీటరు ధర రూ.112.14కాగా, డీజిల్‌ లీటరు ధర రూ.104.53లుగా ఉంది. హైదరాబాద్‌లో ఇవాళ పెట్రోల్‌ లీటరు ధర రూ.109.73లు కాగా, డీజిల్‌ లీటరు ధర రూ.102.80లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని