Published : 10 May 2022 21:44 IST

Tesla: 1.30 లక్షల కార్లను రీకాల్‌ చేసిన టెస్లా.. సమస్య ఇదే!

వాషింగ్టన్‌: విద్యుత్తు కార్ల తయారీ దిగ్గజం ‘టెస్లా’.. అమెరికాలో భారీ ఎత్తున వాహనాలను రీకాల్‌ చేస్తోంది. దాదాపు 1.30 లక్షల కార్లను వెనక్కి పిలిపిస్తోంది. వాహనంలోని టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే పనితీరుపై ప్రభావం చూపగల ‘ఓవర్‌ హీటింగ్‌’ సమస్యను పరిష్కరించేందుకు ఈ చర్యలు తీసుకుంటోంది. స్థానిక ఆటో సేఫ్టీ రెగ్యులేటర్‌ ‘నేషనల్‌ హైవే ట్రాఫిక్‌ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌(ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ)’ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో 2021, 2022లో ఉత్పత్తి చేసిన అన్ని మోడళ్ల వాహనాలు వెనక్కి రప్పిస్తున్నారు. ఓవర్‌ ది ఏయిర్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ వెల్లడించింది.

కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సీపీయూ అతిగా వేడెక్కడం కారణంగా రియర్‌వ్యూ కెమెరా, హెచ్చరిక లైట్లు, ఇతర సమాచారం ప్రదర్శించే సెంటర్ డిస్‌ప్లే పనిచేయకుండా పోయే ప్రమాదం ఉందని ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ తెలిపింది. ఇదిలా ఉండగా.. వాహనం ‘ట్రాక్‌ మోడ్‌’లో ఉన్నప్పుడు స్పీడో మీటర్‌ను ప్రదర్శించని సమస్య కారణంగా.. ఏప్రిల్‌లోనూ టెస్లా సంస్థ 48 వేల మోడల్‌ 3 వాహనాలను వెనక్కి పిలిపించింది. గతంలో చైనాలో ఏకంగా 2.85 లక్షల లక్షల విద్యుత్తు వాహనాలను రీకాల్‌ చేసింది. క్రూజ్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని