Union Budget 2022: ఈ బడ్జెట్‌తో ప్రతి ఒక్కరికీ ప్రయోజనం ఉంటుంది

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు వాటా ఉంటుందని ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ అన్నారు. 

Updated : 01 Feb 2022 11:19 IST

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు వాటా ఉంటుందని ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ అన్నారు. 

‘ఈ బడ్జెట్‌లో ప్రతి రంగానికి వాటా ఉంటుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతి రంగం అవసరాలకు అనుగుణంగా సమగ్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఇది ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. అందరూ కాస్త ఓపికపట్టాలని నేను కోరుతున్నాను. ఈ బడ్జెట్‌తో ప్రజలు సంతోషంగా ఉంటారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.  

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. కరోనాతో అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్‌లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని