new Pulsar N160: కొత్త పల్సర్‌ ఎన్‌ 160 ఆవిష్కరణ

బజాజ్‌ ఆటో తన పల్సర్‌ ఎన్‌160లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఇపుడున్న ఫీచర్లకు తోడు టర్న్‌-బై-టర్న్‌ నేవిగేషన్‌ను తన బ్లూటూత్‌ ఆధారిత ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ ద్వారా తీసుకొచ్చింది. శాంపేన్‌ గోల్డ్‌ 33 ఎమ్‌ఎమ్‌ యూఎస్‌డీ ఫోర్క్స్‌ను సైతం కొత్తగా జత చేసింది.

Published : 15 Jun 2024 02:42 IST

ధర రూ.1,39,693

దిల్లీ: బజాజ్‌ ఆటో తన పల్సర్‌ ఎన్‌160లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఇపుడున్న ఫీచర్లకు తోడు టర్న్‌-బై-టర్న్‌ నేవిగేషన్‌ను తన బ్లూటూత్‌ ఆధారిత ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ ద్వారా తీసుకొచ్చింది. శాంపేన్‌ గోల్డ్‌ 33 ఎమ్‌ఎమ్‌ యూఎస్‌డీ ఫోర్క్స్‌ను సైతం కొత్తగా జత చేసింది. ఏబీఎస్‌ రైడ్‌ మోడ్‌(వర్షం, రోడ్డు, ఆఫ్‌ రోడ్‌)లనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. ధర రూ.1,39,693(ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. పల్సర్‌ 125, పల్సర్‌ 150, పల్సర్‌ 220ఎఫ్‌లలోనూ సరికొత్త ఫీచర్లను జత చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. పల్సర్‌ 125 కార్బన్‌ ఫైబర్‌ సింగిల్‌ సీట్‌ రూ.92,883, పల్సర్‌ 150 సింగిల్‌ డిస్క్‌ రూ.1,13,696, పల్సర్‌ 220ఎఫ్‌ రూ.1,41,024(ఎక్స్‌షోరూం) ధరల వద్ద లభిస్తాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని