City For Expats: ప్రవాసులు నివసించడానికి అత్యంత అనువైన నగరం ఇదే..
ప్రపంచంలో ప్రవాసులకు అత్యంత అనువైన నగరాల జాబితాను ఇంటర్నేషన్స్ విడుదల చేసింది. జీవన ప్రమాణాలు, ప్రజారవాణా, క్రీడా అవకాశాలు మెరుగ్గా ఉన్నందున స్పెయిన్‌లోని వాలెన్సియా ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రవాసులు నివసించడానికి, పని చేయడానికి అత్యంత అనువైన నగరాల జాబితాలో స్పెయిన్‌కు చెందిన వాలెన్సియా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తొలి మూడు నగరాలు మూడు వేర్వేరు ఖండాలకు చెందినవి కావడం విశేషం. ఈ మేరకు ‘ఎక్స్‌ప్యాట్ సిటీ ర్యాంకింగ్ లిస్ట్ 2022’ను ఇంటర్నేషన్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులను సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు.
వాలెన్సియాలో జీవన ప్రమాణాలు, ప్రజా రవాణా, క్రీడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. తర్వాతి స్థానంలో దుబాయ్ నిలిచింది. కొత్తగా వచ్చేవారికి ఇక్కడ ఘన స్వాగతం లభిస్తుందని సర్వేలో వెల్లడించారు. ఇక అత్యంత అందుబాటు ధరల్లో నివసించడానికి అనువుగా ఉన్నందున మెక్సికో సిటీ మూడోస్థానాన్ని దక్కించుకుంది.
50 నగరాలతో కూడిన ఈ జాబితాలో దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నెస్‌బర్గ్ చివరి స్థానంలో నిలిచింది. భద్రత లేకపోవడంతో పాటు చాలా ఖరీదైన నగరమని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. కింది నుంచి రెండో స్థానంలో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, మూడో స్థానంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో నివాసాలు అందుబాటు ధరలో లేవని పేర్కొన్నారు. అమెరికాలోని మియామీ 12వ స్థానాన్ని దక్కించుకుంది. న్యూయార్క్ 16, టొరంటో 19వ స్థానంలో ఉన్నాయి. లండన్ 40వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం.
ఆసియాలో బ్యాంకాక్ తక్కువ ఖర్చుతో నివసించదగిన నగరంగా నిలిచి జాబితాలో ఆరో స్థానంలో ఉంది. సింగపూర్ పదో స్థానం దక్కించుకుంది. ఇక వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెల్బోర్న్లో బాగుంటుందని సర్వేలో పాల్గొంటున్నవారు చెప్పడంతో ఈ నగరం 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల్ని సర్వే చేసి ఇంటర్నేషన్స్ ఈ జాబితాను విడుదల చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
-
World News
Flight: 13 గంటలు ప్రయాణించి.. టేకాఫ్ అయిన చోటే దిగిన విమానం..!