Millionaires: ప్రపంచంలో అత్యధిక మిలియనీర్లు ఉన్న నగరాలివే..!

అత్యధిక మిలియనీర్లు కలిగిన నగరాల జాబితాలో న్యూయార్క్‌, టోక్యో, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు ‘హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌’ నివేదిక తెలిపింది. ఈ జాబితాలో తొలి పది స్థానాల్లో సగం అమెరికాకు చెందిన నగరాలే ఉన్నట్లు పేర్కొంది. కనీసం 1

Updated : 14 Sep 2022 15:35 IST

వాషింగ్టన్‌: అత్యధిక మిలియనీర్లు కలిగిన నగరాల జాబితాలో న్యూయార్క్‌, టోక్యో, శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా తొలి మూడు స్థానాల్లో ఉన్నట్లు ‘హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్‌ గ్రూప్‌’ నివేదిక తెలిపింది. ఈ జాబితాలో తొలి పది స్థానాల్లో సగం అమెరికాకు చెందిన నగరాలే ఉన్నట్లు పేర్కొంది. కనీసం 1 మిలియన్‌ డాలర్ల మదుపు చేయగల ఆస్తులు ఉన్న వ్యక్తుల్ని నివేదిక మిలియనీర్లుగా లెక్కగట్టింది.

అయితే, 2022 తొలి అర్ధభాగంలో న్యూయార్క్‌ నగరంలో ధనవంతుల సంఖ్య 12 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. అదే సమయంలో శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ‘హై నెట్‌-వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (HNI)’ సంఖ్య 4 శాతం పెరగడం గమనార్హం. అత్యధిక మిలియనీర్లు కలిగిన నగరాల జాబితాలో నాలుగో స్థానంలో లండన్‌ నిలిచింది.  2022 తొలి ఆరు నెలల్లో ఈ నగరంలో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 9 శాతం తగ్గింది.

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌, యూఏఈలోని షార్జా నగరాల్లో మిలియనీర్ల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. ఈ వరుసలో అబుదాబి, దుబాయ్‌ కూడా ఉన్నాయి. తక్కువ పన్నులు, కొత్త నివాస విధానాలతో యూఏఈ సంపన్నులను ఆకర్షిస్తోందని పేర్కొంది. రష్యా నుంచి ధనవంతులు యూఏఈకి భారీ ఎత్తున తరలి వస్తుండడంతో ఆ దేశ నగరాల్లో శ్రీమంతుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఈ జాబితాలో చైనాకు చెందిన బీజింగ్‌, షాంఘై వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి. రష్యా తర్వాత చైనా నుంచే అత్యధిక మంది ధనవంతులు వలస వెళ్లే అవకాశముందని నివేదిక అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని