Amazon Prime Day: ప్రైమ్‌ డే సేల్‌లో శాంసంగ్‌, ఐకూ కొత్త ఫోన్లు.. మోటో ఫోల్డబుల్‌పై డిస్కౌంట్‌

Amazon Prime Day 2024: త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు అందించనుంది.

Published : 06 Jul 2024 20:40 IST

Amazon Prime Day 2024 | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ (Amazon Prime Day sale) తేదీలను ఇప్పటికే ప్రకటించింది. ప్రైమ్‌ మెంబర్ల కోసం ఎక్స్‌క్లూజివ్‌గా జులై 20, 21 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ల్యాప్‌టాప్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో పాటు ఇతర ప్రొడక్టులపైనా డిస్కౌంట్లు లభించనున్నాయి. శాంసంగ్‌, ఐకూ, మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయి.

తాజాగా భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసిన మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా (Motorola Razr 50 Ultra)పై ఈ సేల్‌లో పెద్ద ఎత్తున డిస్కౌంట్‌ పొందొచ్చు.  12 GB ర్యామ్‌ + 512 GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.99,999తో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సేల్‌ సమయంలో ఈ మడత ఫోన్‌పై రూ.10వేలు తగ్గింపు అందించనుంది. అంటే రూ.89,999కే కొనుగోలు చేయొచ్చన్నమాట. ఆసక్తి ఉన్న వాళ్లు జులై 10 నుంచే ప్రీ రిజర్వేషన్‌ చేసుకోవచ్చని అమెజాన్‌ తెలిపింది. త్వరలో లాంచ్‌కి సిద్ధంగా ఉన్న శాంసంగ్‌ గెలాక్సీ ఎం35, ఐకూ జెడ్9 లైట్‌ 5జీ, హానర్‌ 200 5జీ, హానర్‌ 200 ప్రో 5జీ, లావా బ్లేజ్‌ ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రైమ్‌ సేల్‌లో అందుబాటులో రానున్నాయి.

5-10 ఏళ్లలో ₹2.5 లక్షల కోట్లకు.. డీమార్ట్‌నీ అధిగమిస్తాం: జెప్టో సీఈఓ

సుమారు 450కి పైగా బ్రాండ్లు వేలాది కొత్త ప్రొడక్టులను సేల్‌లో లాంచ్‌ చేయనున్నట్లు అమెజాన్‌ వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 40శాతం వరకు తగ్గింపు పొందొచ్చని వెబ్‌సైట్‌లో పేర్కొంది. 24 నెలల పాటు నో కాస్ట్‌ ఈఎంఐ, ఎంచుకొన్న ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ ఇవ్వనుంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం, అమెజాన్‌ పే క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. కొత్తగా ఈ కార్డు తీసుకునే వారికి ప్రైమ్‌ మెంబర్లకు వెల్‌కమ్‌ రివార్డుల కింద రూ.2,500 వరకు ప్రయోజనాలను అమెజాన్‌ అందించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని