Updated : 18 Dec 2021 16:21 IST

ఈ టిప్స్‌తో ఆన్‌లైన్ లావాదేవీలు సుర‌క్షితం

దేశంలో డిజిట‌ల్ వినియోగం బాగా పెరిగింది. ఎక్క‌డికైనా షాపింగ్‌కి వెళ్లినా, తిన‌డానికి వెళ్లినా చెల్లింపుల కోసం కార్డు తీస్తున్నాం, లేదా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. రోడ్డు ప్ర‌క్క‌న్న ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఆన్లైన్ చెల్లింపుల‌ను అనుమ‌తిస్తున్నారు. గ‌త ఏడాది కాలంలో కిరాణా దుకాణాల ద‌గ్గ‌ర నుంచి స్థానిక వ్యాపారులు, కొత్త‌గా వ్యాపారం ప్రారంభించిన‌వారు..ఇలా చాలా మంది, వారి వ్యాపార కార్య‌కాల‌పాల‌లో డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌ను భాగం చేశారు. డిజిట‌ల్ లావాదేవీలు ఏ విధంగా పెరిగాయో అదేవిధంగా సైబ‌ర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఇటువంటి మోసాల భారిన ప‌డ‌కండా సౌక‌ర్య‌వంతంగా, సుర‌క్షితంగా చెల్లింపులు చేసేంద‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం.

ఆన్‌లైన్ లావాదేవీలు చేసే వారు ఇవి గుర్తుంచుకోవాలి..

పబ్లిక్ కంప్యూటర్లు / వై-ఫై నెట్‌వర్క్‌లను వాడ‌కండి..
ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, వంటి మోసపూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవకాశం ఎక్కువ‌గా ఉన్నందున పబ్లిక్ పరికరాలు, వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా ఉండటం మంచిది. పేరున్న, ధృవీకరించిన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్‌సైట్‌లు తరచుగా ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలకు అధిక స్థాయి రక్షణను అందిస్తాయి.

కొంత‌మంది అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల‌లో వేరే వాళ్ళ కంప్యూట‌ర్ ద్వారా, ప‌బ్లిక్ వై-ఫై ద్వారా లావాదేవీలు చేస్తుంటారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో స‌మాచారం దొంగిలించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల మీరు తొంద‌ర‌లో ఉన్నప్పటికీ, పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్ వాడిగానీ, పబ్లిక్ కంప్యూటర్ నుంచి గానీ నగదు రహిత లావాదేవీలు చేయ‌కూడ‌దు. అలాగే బిల్లు చెల్లింపుల‌కు ముఖ్యంగా హోట‌ళ్లు, విమానాశ్ర‌య లాంజ్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటి ప్ర‌దేశాల‌లో బిల్లు చెల్లింపుల కోసం ప‌బ్లిక్ వై-ఫైని ఎక్కువ‌గా వినియోగిస్తుంటారు. ఇలాంటి చోట బిల్లు చెల్లింపుల‌కు మొబైల్ నెట్‌వ‌ర్క‌నే ఉప‌యోగించాలి. ఇత‌ర‌ ఆర్థిక లావాదేవీల కోసం మీ వ్య‌క్తిగ‌త కంప్యూటర్, వై-ఫై ల‌ను మాత్ర‌మే వాడాలి.

మీ మొబైల్లో ఇన్‌స్టాల్ అవుతున్న యాప్స్‌ని గ‌మ‌నించండి..
కొన్ని యాప్‌లు మీ మొబైల్‌లో ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ కావ‌చ్చు. అటువంటి యాప్‌ల‌ను గ‌మ‌నించి అన్ఇన్‌స్టాల్ చేయండి. అలాగే, ఏదైనా యాప్‌ను మీ డివైజ్‌కి డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేసేముందు వాటిని న‌మ్మ‌క‌మైన సంస్థ‌లు రూపొందించిన‌వా లేదా అని తెలుసుకోవాలి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్‌ల‌కు కూడా చట్టబద్ధత‌ ఉండాలి. యాప్ స్టోర్‌, ప్లే స్టోర్ వంటి వాటిలో కూడా చ‌ట్ట‌విరుద్ధ‌మైన యాప్‌లు ఉండే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల స‌మీక్ష‌కులు ఇచ్చే రివ్యూల‌ను ప‌రిశీలించండి. త‌క్కువ సంఖ్య‌లో డౌన్‌లోడ్‌లు ఉన్న యాప్‌ల జోలికి పోకండి. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉంద‌ని ధృవీక‌రించుకున్న త‌ర్వాత మాత్ర‌మే డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కెమెరా, ఫోన్ బుక్‌, ఎస్ఎమ్ఎస్ ప‌ఠ‌నం మొద‌లైన వాటికి అనుమ‌తి నిరాక‌రించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఏదైనా లింక్‌ను క్లిక్ చేసే ముందు జాగ్ర‌త్త‌..
సుర‌క్షిత‌మైన డిజిట‌ల్ చెల్లింపుల కోసం అనుమానాస్ప‌ద యాప్‌లు, వెబ్‌సైట్‌ల‌ను నివారించాలి. ప్రైవేట్‌/వ‌ర్చువ‌ల్ బ్రౌజ‌ర్‌లను, HTTPS:// తో ప్రారంభ‌మ‌య్యే సుర‌క్షిత క‌న‌క్ష‌న్ల‌ను ఎంచుకుని మ‌రింత భ‌ద్రంగా ఆర్థిక లావాదేవీల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. ముఖ్యంగా HTTP తో ప్రారంభ‌మ‌య్యే సైట్‌లు జోలికి పోవ‌ద్దు. ఇవి సుర‌క్షితం కాదు. HTTPS:// లు, అన‌వ‌స‌ర‌మైన సైట్ ఓపెన్ కాకుండా, స‌మాచారం నిల్వ చేయ‌కుండా నిరోధించి, సుర‌క్షితమైన ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను అందించే విధంగా రూపొందించారు. లావాదేవీలు పూర్తైన అనంత‌రం వెబ్‌సైట్ నుంచి లాగ‌వుట్ కావ‌డం ఏ ప‌రిస్థితుల‌లోనూ మ‌ర‌వ‌కూడ‌దు.

ఈ విష‌యాల‌లోనూ జాగ్ర‌త్త ప‌డాలి..
ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి బ్యాంక్ ఖాతా నెంబ‌రు, పాస్‌వ‌ర్డ్, ఏటీఎమ్ పిన్, చిరునామా, క్రెడిట్ కార్డు వివ‌రాలు వంటి వ్య‌క్తిగ‌త స‌మాచారం కోసం కాల్ చేస్తే వారికి స‌మాచారం ఇవ్వ‌కూడ‌దు. ఎందుకంటే బ్యాంకులు, లేదా ఇత‌ర ఆర్థిక సంస్థ‌లు ఇలాంటి స‌మాచారం కోసం కాల్ చేయ‌వు. కాబ‌ట్టి అలాంటి కాల్స్‌కి స‌మాధానం ఇవ్వ‌కూడదు. అలాగే ఆర్థిక లావాదేవీలు నిర్వ‌హించే ఆన్‌లైన్ ఖాతాల‌కు బ‌ల‌మైన పాస్‌వ‌ర్డ్‌లు ఇవ్వాలి. వీటిని త‌ర‌చూ మారుస్తుండాలి. గూగుల్ ఆథన్టికేటర్/వన్‌-టైమ్‌-పాస్‌వ‌ర్డ్‌(ఓటీపీ) సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డం ద్వారా మ‌రింత భ‌ద్రంగా లావాదేవీలు నిర్వ‌హించుకోవ‌చ్చు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని