Credit Cards: ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగిన వారు తెలుసుకోవాల్సిన విషయాలు..
ఒక వ్యక్తి క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవడం ప్రారంభించిన తర్వాత, అనేక కొత్త అలవాట్లును అలవరచుకుంటాడు
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వినియోగిస్తున్న వారు కచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది లేదంటే వారు తమ క్రెడిట్ స్కోరును కోల్పోయే అవకాశం ఉంది. కొందరికి క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ గురించి, వారికి ఎలాంటి క్రెడిట్ కార్డు అవసరమో తెలియదు. మరి కొందరు వ్యక్తులు అయితే వారి స్నేహితులు లేదా బంధువులు వినియోగిస్తున్న క్రెడిట్ కార్డును చూసి అలాంటి కార్డునే ఎంచుకుంటారు. అయితే ఇది సరైన పద్దతి కాదు. ఆర్థిక అవసరాలనేవి వివిధ వ్యక్తులకు వివిధ రకాలుగా ఉంటాయి. అందువలన మీ అవసరాలకు తగ్గట్టుగా క్రెడిట్ కార్డును ఎంచుకోవడం మంచిది.
క్రెడిట్ కార్డుతో మనకు వచ్చే సమస్యలు అనేకం ఉంటాయి. ఒక వ్యక్తి క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవడం ప్రారంభించిన తర్వాత, అనేక కొత్త అలవాట్లును అలవరచుకుంటాడు. అయితే, వాస్తవానికి క్రెడిట్ కార్డులు ఆర్థిక గందరగోళానికి దారి తీస్తాయి. ఒకటి కంటే ఎక్కువ కార్డులను కలిగి ఉండడమనేది ఒక వ్యక్తి పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేస్తుంది. కానీ ఎక్కువ క్రెడిట్ కార్డులని కలిగి ఉండడం అనేది మంచి ఆలోచన కాదు. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.
క్రెడిట్ స్కోర్ ని ఎలా ప్రభావితం చేస్తుంది?
మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన క్రెడిట్ కార్డును కలిగి ఉండి దానిని సక్రమంగా నిర్వహించడం మంచి విషయం. భవిష్యత్తులో మీరు రుణం లేదా మరొక క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, రుణదాత మీకు ఇవ్వదలచిన క్రెడిట్ లిమిట్ ని మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా నిర్దేశిస్తాడు. అందువలన మీరు క్రెడిట్ కార్డు చెల్లింపులను సరైన సమయానికి చెల్లించి, మంచిగా నిర్వహించినట్లైతే, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రుణాన్ని పొందగలరు.
ఇక్కడ ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటంటే, క్రెడిట్ కార్డులలో అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్ ని పెంచుకోవాలి, దీనికి ఉపయోగించని కార్డులు సహాయపడతాయి. అయితే, ఇక్కడ కార్డులు క్రియారహితంగా ఉన్న కాలం ఒక్కటే కొంత ఆందోళనకు గురి చేసే విషయం. ఒకవేళ మీరు కార్డులు ఎక్కువ కాలం వినియోగించనట్లైతే, అది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
క్రెడిట్ స్కోరు అనేది వ్యక్తి క్రెడిట్ వినియోగ నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ కాలం క్రెడిట్ కార్డుని ఉపయోగించకపోతే, రుణదాత కార్డు క్రియారహితంగా మారిందని భావించి దానిని రద్దు చేసే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డును జారీ చేసిన వారు దానిని రద్దు చేయాలని నిర్ణయించుకునే సమయం ఒక్కో సంస్థకు ఒక్కోలా మారుతూ ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ ను జారీ చేసే వారు కార్డు స్థితి గురించి సదరు వ్యక్తికి తెలియచేయాల్సిన అవసరం లేదు. కార్డు జారీదారుడు క్రియారహిత ఖాతాను రద్దు చేయాలని భావించినట్లైతే, కార్డు హోల్డెర్ కు ఎలాంటి నోటీసులు పంపాల్సిన అవసరం లేదు.
క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే రెండవ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి సుదీర్ఘ కాల క్రెడిట్ స్కోర్. ఉదాహరణకు, ఒక వ్యక్తి సుదీర్ఘ కాలం పాటు కార్డును నిర్వహిస్తున్నప్పటికీ అది ఎక్కువ కాలం క్రియారహితంగా ఉన్నట్లయితే, కార్డును జారీ చేసిన వ్యక్తి క్రెడిట్ కార్డును రద్దు చేయాలని భావిస్తే, అప్పుడు అది క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేస్తుంది.అందువలన, పాత క్రెడిట్ కార్డును రద్దు చేయడమనేది ఉత్తమ ఆలోచన కాదు. ఒకవేళ అలా చేసినట్లయితే, మీ క్రెడిట్ స్కోర్ పై చెడు ప్రభావం చూపుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ