Updated : 27 Jul 2022 10:16 IST

Used motorcycle: సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనాలని అనుకుంటున్నారా? ఇవి చూశాకే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్విచక్ర వాహనం కొంతమందికి అవసరమైతే.. మరికొంత మందికి సరదా. కొత్త బైక్‌ కొనలేని స్తోమత కొందరిదైతే.. ఇష్టం వచ్చినప్పుడు మార్చడానికి వీలుగా ఉంటుందని సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనడం మరికొందరికి అలవాటు. కారణాలేవైనా, మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడళ్లు వచ్చినా సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌, స్కూటర్లకు డిమాండ్‌ ఎప్పుడూ ఉండేదే. వీటి కోసం ప్రత్యేకమైన షోరూమ్‌లు కూడా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మీరూ సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ కొనాలని చూస్తున్నట్లయితే కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. అన్నింటి కంటే ముందు మీ అవసరానికి తగ్గట్లుగా ఎలాంటి బైక్‌ కొనాలనుకుంటున్నారో ఓ నిర్ణయానికి రండి.

Google (Android 12L) కొన్ని బైకులు చూడ్డానికి తళతళా మెరిసిపోతుంటాయి. చూడ్డానికి అచ్చం కొత్త బైక్‌ను పోలి ఉంటాయి. అలాగని బైక్‌ పైపై మెరుపులు చూసి కొనుగోలు చేస్తే తప్పులో కాలేసినట్లే. ఓ వంద రూపాయలు పెట్టి వాటర్‌ సర్వీసింగ్‌ చేస్తే ఏ బైక్‌ అయినా కొత్త దానిలా మారిపోతుందన్న విషయాన్ని ఇక్కడ మరిచిపోకండి.

Google (Android 12L) మీరు బైక్‌ కొనడానికి వెళ్లినప్పుడు వెలుతురు బాగా ఉండే సమయం చూసుకుని వెళ్లండి. చీకటిగా ఉన్నప్పుడో, వెలుతురు తక్కువగా ఉన్న సమయంలోనో వెళితే బైక్‌లోని లోపాలు బయటపడే అవకాశం ఉండదు. ఒకవేళ ఉదయాన్నే వెళితే.. ‘ఉదయం కదండీ.. అందుకే స్టార్ట్‌ అవ్వడానికి మొండికేస్తోంది’ అనే సమాధానం రావొచ్చు. అదీ నిజమే కదా అని మీరూ పొరబడే అవకాశం ఉంది.

Google (Android 12L) బైక్‌ కొనేటప్పుడు ఇంజిన్‌వైపు ఓ లుక్కేయండి. ఏవైనా ఆయిల్‌ లీకేజీలు, మరకలు ఏమైనా ఉన్నాయోమో గమనించండి. టెస్టు డ్రైవ్‌ చేసేటప్పుడు ఇంజిన్‌ వైపు నుంచి శబ్దాలేవైనా వస్తున్నాయోమో గమనించండి. తెలుపు రంగులో పొగ ఏమైనా వస్తుందేమోనని తనిఖీ చేయండి.

Google (Android 12L) బైక్‌ టెస్ట్‌ డ్రైవ్‌ సమయంలో లైట్లు, హారన్లు, సెల్ఫ్‌ స్టార్ట్‌ వంటి స్విచ్చులన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో గమనించండి.

Google (Android 12L) బైక్‌ ఛాసిస్‌ నంబర్‌ను తనిఖీ చేయడం మరిచిపోవద్దు. మీకు ఇచ్చిన ఆర్‌సీపై ఉన్న నంబర్‌, ఛాసిస్‌ నంబర్‌ ఒకటేనా లేదో చెక్‌ చేయండి. ఇవేమీ చెక్‌ చేయకపోతే మీరు భవిష్యత్‌లో చిక్కుల్లో పడతారు.

Google (Android 12L) బైక్‌కు సంబంధించిన అన్ని కాగితాలూ ఉన్నాయోమో తనిఖీ చేయండి. రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌, ఇన్సూరెన్స్‌ సర్టిఫికెట్‌ వంటివన్నీ తనిఖీ చేయండి.

Google (Android 12L) ఒకవేళ ఆర్టీఓ కార్యాలయం పరిధి మారినప్పుడు ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌) తీసుకోవడం తప్పనిసరి.

Google (Android 12L) బైక్‌పై పాత చలాన్లు ఉన్నాయో లేదో కూడా చెక్‌ చేయండి. పెండింగ్‌ చలాన్లు కట్టిన తర్వాతే బైక్‌ను కొనుగోలు చేయండి.

Google (Android 12L) బైక్‌ ధర గురించి చర్చించే ముందు అవతలి వ్యక్తి అమ్మేందుకు గల కారణాన్ని తెలుసుకోండి. ఒకవేళ కొత్త బైక్‌ను కొనాలన్న ఉత్సుకతలో పాత బైక్‌ వదిలించుకోవాలనుకునే వారైతే  తక్కువ ధరకే విక్రయించే అవకాశం ఉంటుంది. అదే షాపుల్లో అయితే మీకావకాశం ఉండదు.

Google (Android 12L) బైక్‌ తయారైన ఏడాది నుంచి 10 ఏళ్లు దాటితే వీలైనంత తక్కువకే అడగడానికి ప్రయత్నించండి. 15 ఏళ్లు దాటితే బైక్‌ ఆర్‌సీని రెన్యువల్‌ చేయించాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

Google (Android 12L) ఒకవేళ మీకు బైక్‌ నడపడం తప్ప దాని గురించి పెద్దగా అవగాహన లేకపోతే.. మీకు తెలిసిన మెకానిక్‌ను గానీ, వాటి గురించి అవగాహన ఉన్న స్నేహితుడిని గానీ వెంట తీసుకెళ్లండి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts