Loans: అప్పు తీసుకునే ముందు ఈ ఆలోచనలు చేస్తే...
వీలైనంత వరకు రుణం తీసుకోకపోవడం మంచిది. అత్యవసరమనుకుంటేనే తప్ప రుణం తీసుకోకూడదు. అయితే రుణం దేని నిమిత్తం తీసుకుంటున్నామనే దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆర్ధిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. రుణాలను తీసుకునే ముందు చూడవలసిన వివరాలు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: వీలైనంత వరకు అప్పు తీసుకోకపోవడం మంచిది. అత్యవసరమనుకుంటేనే తప్ప తీసుకోకూడదు. అయితే రుణం దేని నిమిత్తం తీసుకుంటున్నామనే దాన్ని బట్టి... భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. రుణాలను తీసుకునే ముందు చూడవలసిన వివరాలు తెలుసుకుందాం.
ఎలాంటి రుణాలు ఉంటాయంటే...
* ఆస్తుల్లో విలువ పెరిగేవి, విలువ తరిగేవి అని రెండు రకాలు ఉంటాయి. రుణాలు తీసుకుని కొనుగోలు చేసిన వస్తువు లేదా ఆస్తి విలువ క్రమంగా పెరుగుతుంటే... వాటిని వృద్ధికి సహకరించే రుణాలుగా పరిగణిస్తారు.
* వృద్ధి చెందే ఆస్తులు లేదా నైపుణ్యం పెంచుకునేందుకు తీసుకునే విద్యా రుణం వంటివి భవిష్యత్తు ఆర్థిక స్థితి మెరుగు పడేందుకు సహకరిస్తాయి.
* రుణంతో కొనుగోలు చేసిన వస్తువులు ధర అంతకంతకు తగ్గిపోతే లేదా భవిష్యత్తులో ఆ రుణం ద్వారా చేసిన ఖర్చు నిరర్థకం అవుతుంది. అంటే అటువంటి రుణం జోలికి వెళ్లకపోవడమే మంచిది.
* జీవితంలో కొన్ని తప్పక చేయాల్సినవి, మరికొన్ని భవిష్యత్తుకు బాటలు వేసే రుణాలు ఉంటాయి. విద్య, గృహం, వ్యాపారం, వివాహం కోసం చేసే రుణాలు ఈ కోవకు చెందినవే.
* ఉంటే అవసరమే కానీ లేకపోయినా ఫరవాలేదు అనుకునే వస్తువులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు వాహనాలు, విలాస వస్తువులు, విహారయాత్రలు మొదలైనవి ఇలాంటివే.
* వీటిని రుణం తీసుకుని కొనుగోలు చేయాల్సిన పని లేదు. చేతిలో డబ్బు ఉంటే ఇలాంటివి చేయొచ్చు. కానీ రుణం తీసుకుని లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించి వీటిని కొనుగోలుచేయడం మంచిది కాదు. వీటి విలువ పెరగదు సరికదా తగ్గుతుంది.
విద్యకు రుణం అవసరమే
విద్య భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది. ఉన్నత చదువులు కలిగిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యకు ఖర్చుచేసే నిధులను ఉద్యోగం లేదా వ్యాపారం చేసి తిరిగి సంపాదించుకోవచ్చు. అలాంటి విద్యకు రుణం తీసుకోవడం సబబే.
గృహ రుణం తీసుకోవచ్చు
ఇంటిపై చేసే పెట్టుబడి వృద్ధిని చేకూరుస్తుంది. రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా అద్దె రూపంలో కొంత ఆదాయం పొందవచ్చు. లేదా యజమానులుగా ఆ గృహంలో ఉండొచ్చు.
వ్యాపారం చేసేందుకు రుణం
వ్యాపారంలో పెట్టుబడి అవసరానికి కొంత రుణం తీసుకోవడం అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుంది. వ్యాపారం చేయడం ద్వారా మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చేసిన ప్రతి వ్యాపారమూ లాభాలను ఇస్తుందని హామీ లేదు. అది మన పనితనం, అంకితభావం మీద ఆధారపడి ఉంటుంది.
వాహన రుణం
రుణం తీసుకుని స్తోమతకు మించిన వాహనాలు కొనుగోలు చేయడం మంచిది కాదు. అవసరమనుకుంటే మనకు సరిపడే ధరలో వాహనం కొనుగోలు చేయడం ఉత్తమం. వాహనం విలువ తగ్గే ఆస్తులలోకి వస్తుంది. కొనుగోలు చేసిన తర్వాత నుంచి క్రమంగా దాని విలువ తగ్గుతూ పోతుంది.
క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డుల వినియోగం ద్వారా రుణంభారం పెరిగే అవకాశం ఉంటుంది. సమయానికి చెల్లింపులు చేయకుంటే వాడిన సొమ్ము కంటే వడ్డీ సొమ్ము ఎక్కువ అవుతుంది. క్రెడిట్ కార్డును అత్యవసరాలకు వినియోగించాలి.
విలాసాలకు వద్దు
విలాస వస్తువులకు, విహారయాత్రలు చేసేందుకు రుణం తీసుకోవడం మంచిది కాదు. డబ్బు ఉంటే ఇలాంటివి చేయడంలో తప్పులేదు గానీ అప్పుచేసి మరీ విలాసాలు చేయవద్దు. అనవసరంగా రుణం తీసుకుని చెల్లించని పక్షంలో అత్యవససర సమయాల్లో రుణం లభించని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఎవరైనా రుణం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం