Motor Insurance: వాహనదారులపై మరింత భారం.. థర్డ్‌ పార్టీ బీమా పెంపు

కార్లు, ద్విచక్ర వాహనదారులకు ఇకపై బీమా ఖర్చులు మరింత పెరగనున్నాయి. వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్స్‌ ఇన్స్యూరెన్స్‌ (third-party motor insurance) ను పెంచుతూ

Published : 26 May 2022 14:11 IST

దిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనదారులకు ఇకపై బీమా ఖర్చులు మరింత పెరగనున్నాయి. వాహనాల థర్డ్‌ పార్టీ మోటార్స్‌ ఇన్స్యూరెన్స్‌ (third-party motor insurance)ను పెంచుతూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) నిర్ణయం తీసుకుంది. జూన్‌ 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రెండేళ్ల తర్వాత థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను ప్రభుత్వం పెంచింది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా దీనిపై మారిటోరియం విధించారు.

తాజా నోటిఫికేషన్‌ ప్రకారం.. సవరించిన థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం ధరలు (వాహనాల కేటగిరీల ప్రకారంగా) ఇలా ఉండనున్నాయి..

* 1000 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్ల ప్రీమియంను రూ.2072 నుంచి రూ.2094కు పెంచారు.

* 1000 సీసీ నుంచి 1500సీసీ వరకు ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు కార్ల బీమా ప్రీమియం రూ.3,221 నుంచి రూ.3416కు పెరగనుంది.

* కాగా.. 1500సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న కార్ల ప్రీమియం మాత్రం రూ.7,897 నుంచి రూ.7,890కి తగ్గింది.

* 150 సీసీ నుంచి 350 సీసీ వరకు ఉండే ద్విచక్ర వాహనాల బీమా ప్రీమియం ఇకపై రూ.1366గా ఉండనుంది.

* 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉండే బైక్‌ల ప్రీమియం జూన్‌ 1 నుంచి రూ.2,804గా ఉండనుంది.

* 30కిలోవాట్ల కంటే తక్కువ ఉండే ఎలక్ట్రిక్‌ కార్ల ప్రీమియం రూ.1,780, 30 నుంచి 65 కిలోవాట్ల మధ్య ఉండే విద్యుత్తు కార్ల ప్రీమియం రూ.2,904గా ఉండనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

* 12000 కేజీల నుంచి 20వేల కేజీల సామర్థ్యం కమర్షియల్‌ వాహనాల థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంను రూ.33,414 నుంచి రూ.35,313కు పెంచారు.

* 40వేల కేజీల కంటే ఎక్కువ సామర్థ్యమున్న కమర్షియల్‌ వాహనాల ప్రీమియం రూ.41,561 నుంచి రూ.44,242కు పెరిగింది.

* విద్యా సంస్థలు ఉపయోగించే బస్సులకు ప్రీమియంపైన 15శాతం డిస్కౌంట్‌, హైబ్రీడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలపై రూ.7.5శాతం డిస్కౌండ్‌ ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు