Vehicle Insurance: వాహన థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంలు ఎంతెంత?

ఏ మోటారు వాహనానికైనా థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి. ఇది మీ వాహనం వల్ల 3వ వ్యక్తికి జరిగిన ప్రమాదానికి పరిహారం చెల్లిస్తుంది.

Updated : 21 Nov 2022 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం.. దేశంలో మోటారు వాహనాన్ని కలిగి ఉన్నవారు ఎవరైనా తప్పనిసరిగా కనీసం థర్డ్‌-పార్టీ బీమా కవరేజీ కలిగి ఉండాలి. ఐఆర్‌డీఏఐ థర్డ్‌-పార్టీ బీమా ప్రీమియంను నిర్ణయిస్తుంది. మూడో పక్షానికి సంబంధించిన ఆస్తి నష్టం, భౌతిక ప్రమాద గాయాలను, మరణం వల్ల జరిగే నష్టాన్ని ఈ బీమా పాలసీ కవర్‌ చేస్తుంది. పాలసీదారుడు క్లెయిమ్‌ చేసినప్పుడు ఇవి చట్టబద్ధంగా, జవాబుదారీగా కనిపిస్తే నష్టపరిహారం చెల్లించడానికి బీమా సంస్థ అంగీకరిస్తుంది. ఈ పాలసీ వల్ల థర్డ్‌ పార్టీకి చెల్లించాల్సిన నష్టాన్ని బీమా కంపెనీలు చెల్లిస్తాయి. దీంతో పాలసీదారుకు ప్రత్యక్షంగా ఆర్థిక భారం ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్‌ను సమర్పించే ముందు, బీమా చేసిన వ్యక్తి తక్షణమే బీమా ప్రొవైడర్‌కు తెలియజేయాలి.

వివిధ కార్లకు, బైక్‌లకు థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంలు ఈ కింది పట్టికలో ఉన్నాయి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని