ఈ విమానాల్లో ఇక పెంపుడు జంతువులనూ తీసుకెళ్లొచ్చు..!

ఆకాశ ఎయిర్‌ తమ ప్రయాణికులకు కొత్త సదుపాయం తీసుకొస్తోంది. ఇకపై దేశీయ విమానాల్లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతవులనూ తమ వెంట తీసుకెళ్లొచ్చని తెలిపింది.

Published : 06 Oct 2022 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కొత్తగా విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన ఆకాశ ఎయిర్‌ (Akasa Air) తమ ప్రయాణికులకు కొత్త సదుపాయం తీసుకొస్తోంది. ఇకపై దేశీయ విమానాల్లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతవులనూ (pets) తమ వెంట తీసుకెళ్లొచ్చని తెలిపింది. నవంబర్‌ నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ వినయ్‌ దూబె తెలిపారు. ఈ ప్రయాణానికి  15 నుంచి బుకింగ్స్‌ ప్రారంభిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఆగస్టు 7న ఆకాశ ఎయిర్‌ సేవలు దేశీయంగా ప్రారంభయ్యాయి. ప్రస్తుతం ఆరు విమానాలు నడుస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్యను 18కి చేరుతుందని కంపెనీ చెబుతోంది. సేవలు ప్రారంభమై నేటికి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో సంస్థ సీఈఓ సంతోషం వ్యక్తంచేశారు. తొలి 60 రోజుల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. ఈ సంస్థ బోయింగ్‌ నుంచి 72 మ్యాక్స్‌ 737 విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టింది. వచ్చే ఏడాది రెండో అర్ధ భాగంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను కూడా  ప్రారంభించాలని యోచిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని