Published : 23 Mar 2022 18:05 IST

BSNLలో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం ఏమందంటే..?

దిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు లేవని కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్‌ చౌహాన్‌ తెలిపారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం అందజేశారు.

సంస్థ పునరుద్ధరణలో భాగంగా ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) వల్ల సేవల్లో ఎలాంటి అంతరాయం చోటుచేసుకోవడం లేదని మంత్రి తెలిపారు. ప్రస్తుతం సంస్థ అవసరాలకు సరిపడా సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. సంస్థ భవనాలు, భూమి, టవర్లు, ఇతర టెలికాం ఉపకరణాలు, టెలికాంయేతర ఉపకరణాలు సహా అన్ని స్థిరాస్తుల విలువ మార్చి 31 నాటికి రూ.89,878 కోట్లుగా ఉందని తెలిపారు. డిసెంబరు 31, 2021 నాటికి మొబైల్ సబ్‌స్క్రైబర్లలో బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ వాటా 9.90 శాతమని తెలిపారు. వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్ల వాటా 15.40 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.

అక్టోబరు 2019లో సంస్థ పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా 50 ఏళ్లు ఆ పైబడిన వారికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని అమలు చేశారు. 4జీ సర్వీసుల కోసం స్పెక్ట్రంను కేటాయించారు. కొన్ని ఆస్తులను నగదీకరించారు. ప్రభుత్వ పూచీ బాండ్ల ద్వారా నిధులను సమీకరించారు. ఫలితంగా 2020-21 నాటికి కంపెనీ ఆపరేటింగ్‌ లాభాలు పాజిటివ్‌గా మారాయని చౌహాన్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts